స్మిత్, కోహ్లి ర్యాంక్‌లు యథాతథం

21 Dec, 2020 03:02 IST|Sakshi

దుబాయ్‌: తొలి డే–నైట్‌ టెస్టులో భారత్‌కు పరాభవం ఎదురైనప్పటికీ ర్యాంకుల పరంగా కెప్టెన్ ‌విరాట్‌ కోహ్లి ర్యాంక్‌లో ఎలాంటి మార్పు రాలేదు. అతను 888 రేటింగ్‌ పాయింట్లతో రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. అడిలైడ్‌ టెస్టులో కెప్టెన్ ‌ఇన్నింగ్స్‌ (74) ఆడిన కోహ్లి రెండు రేటింగ్‌ పాయింట్లను మెరుగు పర్చుకున్నాడు.

అయితే ఈ మ్యాచ్‌లో విఫలమైన టాప్‌ ర్యాంకర్‌ స్మిత్‌ (911) పది రేటింగ్‌ పాయింట్లు కోల్పోయాడు. దీంతో అగ్రస్థానంలోనే కొనసాగుతున్న స్మిత్‌కు రెండో స్థానంలో ఉన్న కోహ్లికి వ్యత్యాసం తగ్గింది. అయితే తన భార్య ప్రసవం కోసం తదుపరి టెస్టులకు గైర్హాజరీ కానున్న నేపథ్యంలో కోహ్లి రేటింగ్‌ మారే అవకాశం ఉండదు. బౌలర్ల విభాగంలో భారత స్పిన్నర్‌ అశ్విన్ ‌ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని 9వ ర్యాంకుకు ఎగబాకాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా 3వ ర్యాంక్‌లో ఉన్నాడు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు