స్టీవ్‌ స్మిత్‌..  మళ్లీ చీటింగ్‌ చేశాడు..!

11 Jan, 2021 10:09 IST|Sakshi

సిడ్నీ:  ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్‌  స్మిత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందీ ఏమీలేదు. బ్యాటింగ్‌లో ఒక మేటి క్రికెటర్‌గా చెప్పుకున్నా, చీటింగ్‌లో కూడా తనకు తానే సాటి అని అప్పుడప్పుడు నిరూపించుకుంటూ ఉంటాడు స్మిత్‌. గతంలో భారత్‌పై ఆడేటప్పుడు ఎల్బీ రివ్యూ విషయంలో డ్రెస్సింగ్‌ రూమ్‌కు సైగ చేసి దొరికిపోయిన స్మిత్‌.. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడ్డాడు. 2018లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన టెస్టులో స్మిత్‌ బాల్‌ టాంపరింగ్‌ వివాదం కారణంగా ఓ ఏడాది మొత్తం క్రికెట్‌కే దూరమయ్యాడు.  అది అభిమానుల మదిల్లోంచి ఇంకా చెదిరిపోకుండానే మళ్లీచీటింగ్‌కు పాల్పడ్డాడు. భారత్‌-ఆస్ట్రేలియా మూడో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో పంత్‌ బ్యాటింగ్‌ చేసే క్రమంలో స్మిత్‌ తనమార్కు మోసానికి తెరలేపాడు. (షోయబ్‌ మాలిక్‌ కారుకు యాక్సిడెంట్‌)

గార్డ్‌ మార్క్‌లను మార్చేశాడు..
ప్రతీ క్రికెటర్‌ బ్యాటింగ్‌ చేయడానికి క్రీజ్‌లోకి వెళ్లిన తర్వాత ముందుగా తీసుకునేది గార్డ్‌. అది లెగ్‌ స్టిక్‌, మిడిల్‌ స్టిక్‌ అనేది బ్యాట్స్‌మన్‌ నిర్ణయించుకుని అంపైర్‌ను గార్డ్‌ కోరతాడు. అది సర్వ సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇందులో క్రీజ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌కు మాత్రమే తన గార్డ్‌ను చేంజ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆసీస్‌తో మూడో టెస్టులో పంత్‌ బ్యాటింగ్‌ చేసే సమయంలో గార్డ్‌ మార్క్‌లను స్మిత్‌ మార్చేశాడు. చిన్నపాటి బ్రేక్‌లో స్మిత్‌ పంత్‌ బ్యాటింగ్‌ గార్డ్‌ను చెరిపేసి కొత్త గార్డ్‌ను కాలుతో గీశాడు. ఇది కెమెరాల్లో రికార్డయ్యింది.  ఇక్కడ స్మిత్‌ గార్డ్‌ మారుస్తున్న విధానం కనిపించింది.  ఇక్కడ స్మిత్‌ పూర్తిగా కనిపించకపోయినా గార్డ్‌ మార్చింది అతననే విషయం స్పష్టంగా తెలుస్తోంది. కాగా, ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పంత్‌.. స్మిత్‌ ఏదైతే గార్డ్‌ గీశాడో దాన్ని అనుసరించే బ్యాటింగ్‌ చేశాడు. ఇలా చేయడం బ్యాట్స్‌మన్‌ను మోసం చేయడమే అవుతుంది. దీనిపై సోషల్‌ మీడియాలో విపరీతమైనట్రోలింగ్‌ నడుస్తోంది. ఒక ఏడాది బ్యాన్‌ పడ్డ క్రికెటర్‌..మళ్లీ చీటింగ్‌ చేయడానికి ఏమాత్రం  వెనుకాడలేదు. చీటర్స్‌ ఎప్పుడూ చీటర్సే అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.  (పుజారా-రిషభ్‌ బ్యాటింగ్‌ రికార్డు)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు