Smriti Mandhana: కోహ్లి, ధావన్‌ల తర్వాత స్మృతి మందానకే సాధ్యమైంది..

22 Sep, 2022 08:07 IST|Sakshi

టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మందాన వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డు అందుకుంది. వన్డేల్లో వేగంగా 3,000 పరుగులు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్లలో ఆమె మూడో బ్యాటర్‌గా నిలిచింది. ఈ జాబితాలో శిఖర్‌ ధావన్‌ ముందు వరుసలో ఉన్నాడు. అతను 72 ఇన్నింగ్స్‌ల్లో, కోహ్లి 75 ఇన్నింగ్స్‌ల్లో 3,000 క్లబ్‌లో చేరాడు. ఇతనికి ఒక్క ఇన్నింగ్స్‌ తేడాతో మందాన 76వ ఇన్నింగ్స్‌లో రికార్డు చేరుకుంది.

గత నెలలో ఐసీసీ ప్రకటించిన ఐదుగురు ‘క్రికెట్‌ సూపర్‌స్టార్స్‌’లో మందాన  ఉంది. మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్‌ల తర్వాత భారత మహిళల్లో 3,000 పరుగుల మైలురాయిని దాటిన మూడో క్రికెటర్‌ మందాన. ప్రత్యేకించి మహిళల్లో 22 మంది క్రికెటర్లు ఈ ఘనత సాధించగా... వేగంగా చేరుకున్న జాబితాలోనూ ఆమెది మూడో స్థానం కావడం మరో విశేషం. బెలిండా క్లార్క్‌ (ఆస్ట్రేలియా; 62 ఇన్నింగ్స్‌లు), మెగ్‌ లానింగ్‌ (ఆస్ట్రేలియా; 64 ఇన్నింగ్స్‌లు) భారత బ్యాటర్‌  కంటే చకచకా 3000 పరుగుల్ని పూర్తి చేశారు.

చదవండి: 23 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌ గడ్డపై కొత్త చరిత్ర

>
మరిన్ని వార్తలు