Smriti Mandhana: టీ20 వరల్డ్‌కప్‌లో ఆసీస్‌ చేతిలో ఓటమి తర్వాత..

15 Sep, 2021 09:51 IST|Sakshi

Smriti Mandhana Comments On Team: 2020 మహిళల టి20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమి తర్వాత భారత్‌ ఎంతో మెరుగుపడిందని టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో మూడు ఫార్మాట్లలోనూ సిరీస్‌లు ఆడేందుకు బ్రిస్బేన్‌లో ఉన్న టీమిండియా... 14 రోజుల కఠిన క్వారంటైన్‌ను ముగించింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంధాన ‘టి20 ప్రపంచ కప్‌ తర్వాత కోవిడ్‌–19 రూపంలో జట్టుకు సుదీర్ఘ విరామం దొరికింది. దాంతో ప్లేయర్లందరికీ తమ ఆటతీరును అర్థం చేసుకునేందుకు అవకాశం దొరికింది.

ఆ సమయంలో ఎక్కడ బలంగా ఉన్నాం... ఎక్కడ మెరుగవ్వాలనే అంశాలపై ఒక అవగాహనకు వచ్చాం. అంతేకాకుండా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాం. ఆసీస్‌తో ఆడేందుకు ఎదురు చూస్తున్నా’ అని స్మృతి పేర్కొంది. ఆసీస్‌తో ఈ నెల 21తో జరిగే తొలి వన్డేతో భారత పర్యటన మొదలవుతుంది. అనంతరం 24, 26వ తేదీల్లో మిగిలిన రెండు వన్డేలను ఆడుతుంది. సెపె్టంబర్‌ 30–అక్టోబర్‌ 3 మధ్య ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు (డే–నైట్‌) జరుగుతుంది. అక్టోబర్‌ 7, 9, 11వ తేదీల్లో మూడు టి20లు జరుగుతాయి. 

చదవండి: Suryakumar Yadav: నాడు కవ్వించిన కోహ్లి, బ్యాట్‌తో జవాబిచ్చి.. టాప్‌-5 ఇన్నింగ్స్‌!

మరిన్ని వార్తలు