గంగూలీ తొలి కోచ్ క‌న్నుమూత

30 Jul, 2020 19:30 IST|Sakshi

కోల్‌క‌తా : టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్య‌క్షుడు సౌరవ్ గంగూలీ చిన్ననాటి కోచ్ అశోక్ ముస్తఫీ(86) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం మృతి చెందారు. ఆయన తన కూతురితో పాటు లండన్​లో ఉండేవారు. ఆయన గుండె సంబంధిత వ్యాధి కారణంగా ఏప్రిల్​ నుంచి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఉదయం కార్డియాక్ అరెస్ట్​కు గురికావడంతో తుదిశ్వాస విడిచారని ముస్తఫీ కుటుంబ సభ్యులు తెలిపారు.

బెంగాల్​కు క్రికెట్ పాఠాలు నేర్పే దుఖీరామ్ క్రికెట్ కోచింగ్ సెంటర్​లో అశోక్​ ముస్తాఫీ ప్రముఖ కోచ్​గా ఉండేవారు. ఆయన వద్ద శిక్షణ తీసుకున్న 12మంది బెంగాల్​ రంజీ క్రికెటర్లుగా ఎదిగారు. సౌర‌వ్ గంగూలీ చిన్నతనంలో తొలిసారిగా ముస్తాఫీ వద్దే క్రికెట్​లో ఓనమాలు దిద్దాడు. దాదా స్నేహితుడు సంజయ్ దాస్ కూడా ఆయన వద్దే క్రికెట్ ప్రారంభించాడు. గత నెల ముస్తాఫీ ఆరోగ్యం క్షీణించగా.. వైద్యానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను గంగూలీ, సంజయ్ చేశారు. 

మరిన్ని వార్తలు