VVS Laxman: ఎన్‌సీఏ హెడ్‌గా వివిఎస్‌ లక్ష్మణ్‌!

14 Nov, 2021 19:54 IST|Sakshi

VVS Laxman May Take Charge As NCA Head.. టీమిండియా మాజీ క్రికెటర్‌ వివిఎస్‌ లక్ష్మణ్‌ త్వరలో నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సిఏ) చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు ఎన్‌సిఏ హెడ్‌గా ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌ .. టీమ్‌ ఇండియా కోచ్‌గా బిసీసీఐ నియమించడంతో.. ఖాళీ అయిన ఆ స్థానానికి వివిఎస్‌ లక్ష్మణ్‌ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఆదివారం ధ్రువీకరించారు. తొలుత ఈ బాధ్యతలు చేపట్టేందుకు లక్ష్మణ్‌ నిరాకరించాడని సమాచారం.

అయితే గంగూలీ, బీసీసీఐ సెక్రటరీ జైషా చర్చలు జరిపిన తర్వాత లక్ష్మణ్‌ అంగీకరించారని సమాచారం. మరో వైపు రాహుల్‌ ద్రవిడ్‌ విషయంలోనూ ఇదే జరిగింది. టీమ్‌ ఇండియా కోచ్‌ బాధ్యతలను తీసుకునేందుకు రాహుల్‌ తిరస్కరించగా.. గంగూలీ ఒప్పించారని వార్తలు వచ్చాయి. రాబోయే రెండు, మూడేళ్లలో టీమిండియా టి20 ప్రపంచకప్‌ 2022తో పాటు టెస్టు చాంపియన్‌ షిప్‌, వన్డే ప్రపంచకప్‌ టోర్నీలు ఆడనుంది. క్రికెట్‌ దిగ్గజాలు ఉన్నత పదవులను ఇవ్వడంతో క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
(చదవండి: T20 WC 2021 Final: ఎడమ పక్కన నిల్చున్న కెప్టెన్‌దే టైటిల్‌)

మరిన్ని వార్తలు