మన దేశంలోనే జరిపేందుకు ప్రయత్నిస్తాం 

29 Sep, 2020 03:09 IST|Sakshi

భారత్‌–ఇంగ్లండ్‌ సిరీస్‌పై గంగూలీ 

బయో బబుల్‌ ఆలోచన ఉందన్న బోర్డు అధ్యక్షుడు  

దుబాయ్‌: వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో భారత్‌–ఇంగ్లండ్‌ మధ్య జరగాల్సిన సిరీస్‌ను స్వదేశంలోనే నిర్వహించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నాడు. అవసరమైతే ఈ సిరీస్‌ను యూఏఈలో నిర్వహించే విధంగా అక్కడి బోర్డులో బీసీసీఐ ఇప్పటికే ఒప్పందం చేసుకున్నా... మన దేశంలో నిర్వహించాలనేదే తమ ఆలోచన అని అతను అన్నాడు. ఇందుకోసం ప్రస్తుతం దేశంలో కోవిడ్‌–19 పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సౌరవ్‌ వెల్లడించాడు. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య 5 టెస్టులు, 3 వన్డేలు, 3 టి20లు జరగాల్సి ఉంది. ‘భారత గడ్డపై దీనిని జరిపేందుకే మా తొలి ప్రాధాన్యత. అందు కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తాం. యూఏఈ తరహాలో మన నగరాల్లోని మైదానాల్లో కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి బయో బబుల్‌ను ఏర్పాటు చేయవచ్చు. క్రికెట్‌ భారత్‌లో జరగాలని అంతా కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడేమీ చెప్పలేం.

గత ఆరు నెలలుగా పరిస్థితేం బాగా లేదు. అటు ఆట జరిగాలి. ఇటు జీవితాలూ నిలవాలి కాబట్టి అన్నీ ఆలోచించాల్సి ఉంటుంది. ఐపీఎల్‌ జరిగేందుకు ఏమాత్రం అ వకాశం లేదని భావించిన సమయంలో మేం దానిని నిర్వహిం చి చూపించడం సంతోషంగా ఉంది’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. మరోవైపు ధోని సా ధించిన ఘనతలను బట్టి చూస్తే అతనిడి అన్ని విధాలా గౌరవించుకోవాలన్న గంగూలీ... ప్రస్తు త పరిస్థితుల్లో ధోని వీడ్కోలు మ్యాచ్‌ విషయంపై మాత్రం ఏమీ చెప్పలేనని స్ప ష్టం చేశాడు. తన మార్గదర్శ నంపై ఢిల్లీ క్యాపిటల్స్‌ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యలు పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకే వస్తాయనే విమర్శలపై కూడా ‘దాదా’ పెదవి విప్పాడు. సుమారు 500 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన తను అయ్యేరే కాదు, కోహ్లి... ఇంకే ఆటగాడు అడిగినా సాయమందిస్తానని చెప్పాడు. అంత మాత్రాన దీనికి విరుద్ధ ప్రయోజనాలు అపాదించడం తగదని హితవు పలికాడు.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు