కరీబియన్ల పై ప్రతీకారం తీర్చుకున్న సఫారీలు..

28 Jun, 2021 16:23 IST|Sakshi

 గ్రెనడా: వెస్టిండీస్ చేతిలో తొలి టీ20 ఓటమికి దక్షిణాఫ్రికా ప్రతీకారం తీర్చుకుంది. గ్రెనడా వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 16 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 167 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 9 వికెట్లు కోల్పోయి 150 పరుగులకే పరిమితమైంది. దీంతో ఐదు టీ20ల ఈ సిరీస్ ను దక్షిణాఫ్రికా ప్రస్తుతం 1-1తో సమం చేసింది. టాస్‌ ఓడి మెదట బ్యాటింగ్‌ చేసిన ఓపెనర్లు హెండ్రిక్స్, డికాక్ శుభారంభం ఇచ్చారు. ఓపెనర్ హెండ్రిక్స్ (42), కెప్టెన్ బవుమా (46) డికాక్(26) మెరుగైన స్కోర్లు నమోదు చేశారు.

వెస్టిండీస్ బౌలర్లలో మెకాయ్ మూడు వికెట్లు పడగొట్టగా.. కెవిన్ రెండు, హోల్డర్, రసెల్ ఒక్కో వికెట్ తీశారు. ఆనంతరం 167 పరుగల లక్ష్యంతో బరి లోకి దిగిన వెస్టిండీస్ కు ఓపెనర్లు ఎవిన్ లావిస్ (21), ఫ్లెచర్ (35) శుభారంభం ఇచ్చినా.. మిడిలార్డర్‌లో క్రిస్‌గేల్ (8), నికోలస్ పూరన్ (9), కీరన్ పొలార్డ్ (1), ఆండ్రీ రసెల్ (5) తేలిపోయారు. మధ్యలో ఫ్యాబియన్ అలెన్ సిక్స్‌లు, ఫోర్లుతో కాసేపు సఫారీలను కంగారు పెట్టినా వరస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో కరీబియన్లకి 16 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. దక్షిణాఫ్రికా జట్టులో రబాడకి మూడు వికెట్లు దక్కగా.. లిండేకి రెండు, లుంగి ఎంగిడి, నార్జ్, షంషీకి ఒక్కో వికెట్ పడ్డాయి. ఈ మ్యాచ్‌ లో రెండు కీలక మైన వికెట్లు పడగొట్లిన జార్జ్‌ లిండే కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది


చదవండి: India Tour Of Sri Lanka: శ్రీలంకకు బయల్దేరిన భారత జట్టు ఇదే!

మరిన్ని వార్తలు