Commonwealth Games Cricket 2022: 1998 కామన్వెల్త్‌ గేమ్స్‌.. క్రికెట్‌లో టీమిండియాది ఎన్నో స్థానం..?

26 Jul, 2022 16:45 IST|Sakshi

Commonwealth Games: బర్మింగ్‌హామ్‌ వేదికగా ఈనెల (జులై) 28 నుంచి ప్రారంభంకానున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌కు తొలిసారి అవకాశం లభించిన విషయం తెలిసిందే. అయితే, ఈ క్రీడల్లో 24 ఏళ్ల క్రితమే పురుషుల క్రికెట్‌కు ప్రాతినిధ్యం లభించిందన్న విషయం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. కౌలాంలంపూర్‌ వేదికగా జరిగిన 1998 కామన్వెల్త్‌ గేమ్స్‌లో క్రికెట్‌కు తొలిసారి ప్రాతినిధ్యం లభించగా.. అందులో దక్షిణాఫ్రికా స్వర్ణ పతకం నెగ్గింది. 

50 ఓవర్ల ఫార్మాట్‌లో జరిగిన ఈ పోటీల్లో మొత్తం 16 జట్లు 4 గ్రూప్‌లుగా విభజింపబడి పోటీపడగా.. సఫారీలు స్వర్ణాన్ని.. ఆసీస్‌ రజతాన్ని.. కివీస్‌ కాంస్య పతకాన్ని గెలిచాయి. ఆస్ట్రేలియా, కెనడా, అంటిగ్వా అండ్‌ బార్బుడా దేశాలతో పాటు గ్రూప్‌ బిలో తలపడిన భారత్‌ గ్రూప్‌ దశలోనే (3 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే గెలుపు) నిష్క్రమించి ఓవరాల్‌గా 9వ స్థానంలో నిలిచింది.

నాటి టీమిండియాకు అజయ్‌ జడేజా సారధ్యం వహించగా.. అనిల్‌ కుంబ్లే వైస్‌ కెప్టెన్‌గా.. సచిన్‌, లక్ష్మణ్‌ కీలక ప్లేయర్లుగా ఉన్నారు. కీలక ప్లేయర్లు పాకిస్థాన్‌తో సహారా కప్‌ ఆడుతుండటంతో బీసీసీఐ రెండో జట్టును కామన్వెల్త్‌ గేమ్స్‌కు పంపింది. 
చదవండి: CWG 2022: క్రికెట్‌లో గోల్డ్ మెడల్ సాధించగల సత్తా ఉన్న మూడు జట్లు ఇవే..!

మరిన్ని వార్తలు