ఇంగ్లండ్‌ టూర్‌కు జట్లను ప్రకటించిన క్రికెట్‌ సౌతాఫ్రికా

29 Jun, 2022 19:58 IST|Sakshi

South Africa Tour Of England: జులై 19 నుంచి దాదాపు మూడు నెలల పాటు ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌లలో పర్యటించనున్న దక్షిణాఫ్రికా జట్లను (మూడు ఫార్మాట్ల జట్లు) క్రికెట్‌ సౌతాఫ్రికా మంగళవారం ప్రకటించింది. వచ్చే నెల నుంచి సౌతాఫ్రికా ఈ రెండు దేశాలతో మూడు ఫార్మాట్లలో సిరీస్‌లు ఆడనుంది. జులై 19 నుంచి 31 వరకు ఇంగ్లండ్‌తో 3 వన్డేలు, 3 టీ20లు ఆడనున్న సపారీ టీమ్‌.. మధ్యలో ఆగస్ట్‌ 3, 5 తేదీల్లో ఐర్లాండ్‌తో రెండు టీ20లు, ఆతర్వాత  ఆగస్ట్‌ 17-సెప్టెంబర్‌ 12 వరకు ఇంగ్లండ్‌తో మూడు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. 

ఈ సుదీర్ఘ పర్యటనల కోసం క్రికెట్‌ సౌతాఫ్రికా మూడు ఫార్మాట్లకు మూడు వేర్వేరు జట్లతో పాటు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను ప్రకటించింది. ఇటీవల టీమిండియాతో ముగిసిన టీ20 సిరీస్‌లో గాయపడిన వైట్‌బాల్‌ కెప్టెన్‌ టెంబా బవుమా మూడు జట్లలో స్థానం కోల్పోగా.. గుజరాత్‌ టైటాన్స్‌ (ఐపీఎల్‌) ఆటగాడు డేవిడ్‌ మిల్లర్‌, భారత సంతతి ఆటగాడు కేశవ్‌ మహారాజ్‌లు బంపర్‌ ఆఫర్లు కొట్టేశారు. టెస్ట్‌ల్లో డీన్‌ ఎల్గర్‌ను కెప్టెన్‌గా కొనసాగించిన సీఎస్‌ఏ.. వన్డేల్లో కేశవ్ మహారాజ్‌ను, టీ20ల్లో డేవిడ్ మిల్లర్‌ను కెప్టెన్లుగా నియమించింది. 

ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌ దేశాల్లో సౌతాఫ్రికా పర్యటన వివరాలు.. 

 • జులై 19 : ఇంగ్లాండ్ తో తొలి వన్డే 
 • జులై 22 : రెండో వన్డే 
 • జులై 24 : మూడో వన్డే 
 • జులై 27 : తొలి టీ20 
 • జులై 28 : రెండో టీ20 
 • జులై 31 : మూడో టీ20 
 • ఆగస్టు 3 : ఐర్లాండ్ తో తొలి టీ20 
 • ఆగస్టు 5 : రెండో టీ20 
 • ఆగస్టు 17-21 : ఇంగ్లాండ్ తో తొలి టెస్టు 
 • ఆగస్టు 25-29 : రెండో టెస్టు 
 • సెప్టెంబర్ 8-12 : మూడో టెస్టు  
  చదవండి: విరాట్‌ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన బాబర్‌ ఆజమ్‌
మరిన్ని వార్తలు