SA vs WI: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

26 Mar, 2023 21:45 IST|Sakshi

అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికా సరి కొత్త చరిత్ర సృష్టించింది. టీ20ల్లో అత్యధిక టార్గెట్‌ ఛేదించిన జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో 259 పరుగుల లక్ష్యాన్ని చేజ్‌ చేసిన ప్రోటీస్‌.. ఈ ప్రపంచ రికార్డును తమ పేరిట లిఖించుకుంది. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 2018లో ఆక్లాండ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20లో 245 పరుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియా ఛేజ్‌ చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక ఛేజింగ్‌ కాగా.. తాజా మ్యాచ్‌తో ప్రోటీస్‌ ఆసీస్‌ రికార్డును బ్రేక్‌ చేసింది.

259 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రోటీస్‌ బ్యాటర్లలో క్వింటన్‌ డికాక్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 44 బంతులు ఎదుర్కొన్న డికాక్‌ 9 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 100 పరుగులు చేశాడు. డికాక్‌తో పాటు మరో ఓపెనర్‌ రెజా హెండ్రిక్స్‌ (28 బంతుల్లో 68 పరుగులు) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఆఖరిలో కెప్టెన్‌ మార్‌క్రమ్‌ 38 పరుగులతో ఆజేయంగా నిలిచి తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.  ఇక అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌.. జాన్సన్‌(118) అద్బుతమైన సెంచరీ చెలరేగడంతో  నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 258 పరుగులు సాధించింది.  చార్లెస్ కేవలం 39 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
చదవండి: WI vs SA: వెస్టిండీస్‌ క్రికెటర్‌ విధ్వంసకర శతకం.. కేవలం 39 బంతుల్లోనే!

మరిన్ని వార్తలు