IND Vs SA: అతిపెద్ద సవాల్‌.. దక్షిణాఫ్రికాపై గెలవడం అంత ఈజీ కాదు: టీమిండియా మాజీ క్రికెటర్‌

22 Dec, 2021 10:53 IST|Sakshi

దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టెస్ట్‌లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇక టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 26న సెంచూరియన్‌ వేదికగా తొలి టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాకు చేరుకున్న భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. కాగా సఫారీ గడ్డపై తొలి టెస్ట్‌ సిరీస్‌ను కైవసం చేసుకోవాలని కోహ్లి సేన ఊవ్విళ్లూరుతోంది. అయితే, ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా పేసర్లు టీమిండియా బ్యాటర్లకు గట్టి సవాలు విసురుతారని భారత మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ అభిప్రాయపడ్డాడు. 2018లో భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు బ్యాటర్లకు ప్రోటీస్ స్టార్‌ పేసర్‌ కగిసో రబడా చుక్కలు చూపించాడని అతడు తెలిపాడు.

"దక్షిణాఫ్రికా జట్టుకు అత్యత్తుమ పేస్‌ ఎటాక్‌ బౌలింగ్‌ విభాగం ఉంది. ఆ జట్టు స్టార్‌ ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్ట్జే గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. ఇది భారత్‌కు కాస్త ఉపశమనం కలిగించే అంశం. కానీ ఆ జట్టులో రబడా వంటి స్టార్‌ పేసర్‌ ఉన్నాడు. ప్రపంచ అత్యత్తుమ బౌలర్ల్లలో రబడా ఒకడు. వారి వారి పేస్ బౌలర్లు  భారత్‌కు ఖచ్చితంగా సవాలు విసురుతారు" అని అతడు పేర్కొన్నాడు. కాగా 2018 సిరీస్‌లో 15 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా సిరీస్‌ కైవసం​ చేసుకోవడంలో రబడా కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ఇక భారత్‌ బౌలింగ్‌ గురించి మాట్లాడుతూ.. "భారత బౌలింగ్‌ విభాగంలో ప్రపంచస్ధాయి బౌలర్లు ఉన్నారు. జట్టులో జస్‌ప్రీత్‌ బుమ్రా,మహమ్మద్‌ షమీ వంటి అనుభవజ్ఞులైన పేసర్లు ఉన్నారు. టెస్ట్‌ సిరీస్‌లో భారత్‌ 400పైగా పరుగులు సాధిస్తే విజయం సాధించవచ్చు. కానీ ప్రోటీస్ పేసర్లను ఎదుర్కొని రుగులు రాబట్టడం​ అంత సులభం కాదు అని జాఫర్‌ పేర్కొన్నాడు. 

చదవండిVIjay Hazare Trophy: ప్రశాంత్‌ చోప్రా 99, షారుఖ్‌ 79.. సెమీస్‌లో హిమాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు

మరిన్ని వార్తలు