Zubayr Hamza: సౌతాఫ్రికా బ్యాటర్‌పై ఐసీసీ నిషేధం

18 May, 2022 14:19 IST|Sakshi

దుబాయ్: సౌతాఫ్రికా బ్యాటర్ జుబేర్ హమ్జాపై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) నిషేధం విధించింది. డోపింగ్‌ నిరోధక నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా హమ్జాను 9 నెలల పాటు క్రికెట్ సంబంధిత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఐసీసీ ఆదేశించింది. డోపింగ్ నిరోధక నియమాన్ని ఉల్లంఘించినట్టు అంగీకరించడంతో హమ్జాపై డిసెంబర్‌ 22, 2022 వరకు నిషేధం అమల్లో ఉంటుందని ఐసీసీ మంగళవారం ప్రకటించింది. 

17 జనవరి 2022న హమ్జా నుంచి సేకరించిన నమూనాలో నిషేధిత పదార్థమైన ఫ్యూరోసెమైడ్ గుర్తించినట్లు ఐసీసీ పేర్కొంది. ఈ ఏడాది జనవరి 17 నుంచే నిషేధం అమల్లో ఉంటున్నందున మార్చి 22న హమ్జా న్యూజిలాండ్‌పై చేసిన 31 పరుగులు రికార్డుల్లో నుంచి తొలగించనున్నట్లు తెలిపింది. కాగా, 26 ఏళ్ల హమ్జా దక్షిణాఫ్రికా తరఫున 6 టెస్ట్‌లు, ఓ వన్డే ఆడాడు. హమ్జా ఖాతాలో రెండు అర్ధ సెంచరీలు నమోదై ఉన్నాయి.
చదవండి: BAN Vs SL Test: టెస్టుల్లో ముష్ఫికర్‌ రహీమ్‌ అరుదైన రికార్డు!

మరిన్ని వార్తలు