అసలే కోపంలో ఉన్నాడు.. క్రీజులో హెల్మెట్‌ అడ్డుగా

25 Nov, 2021 16:42 IST|Sakshi

Weatherald Scolded for Bizarre Helmet-Kicking Video: షఫీల్డ్‌ షీల్డ్‌ క్రికెట్‌ టోర్నీలో భాగంగా సౌత్‌ ఆస్ట్రేలియా, క్వీన్స్‌లాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బ్యాటింగ్‌ సమయంలో సౌత్‌ ఆస్ట్రేలియా ఆటగాడు  వెదర్లాండ్‌ చేసిన  పని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌కు ముందు బ్రేక్‌ సమయంలో క్వీన్స్‌ల్యాండ్‌ ఫీల్డర్‌ మ్యాట్‌ రెన్‌షా.. క్రీజులో బ్యాటర్స్‌ గార్డ్‌ తీసుకునే చోట హెల్మెట్‌ పెట్టేసి వెళ్లాడు. ఓవర్‌ ప్రారంభం కావడంతో వెదర్లాండ్‌ స్ట్రైకింగ్‌కు వెళ్లాడు. కాగా అప్పటికే వెదర్లాండ్‌ ఏదో విషయంలో కోపంతో ఉన్నాడు.

చదవండి: Trolls On Ajinkya Rahane: కెప్టెన్‌ అయ్యి బతికిపోయావు.. లేదంటే

అంతలో క్రీజులోకి చేరుకున్న వెదర్లాండ్స్‌.. అక్కడ హెల్మెట్‌ ఉండడం చూసి చిర్రెత్తిపోయినట్టున్నాడు. దీంతో హెల్మెట్‌ను ఫుట్‌బాల్‌లా భావించి పెనాల్టీ కిక్‌ ఇవ్వడంతో అది ఎగిరి దూరంగా పడిపోయింది. వెదర్లాండ్‌ చర్య అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. ఇది చూసిన క్వీన్స్‌లాండ్‌ కెప్టెన్‌ ఉస్మాన్‌ ఖవాజా జేక్‌ వెదర్లాండ్స్‌ దగ్గరకు వచ్చి వాదనకు దిగాడు. ఒక హెల్మెట్‌ను అలా తన్నడం ఏంటని.. కాస్త హుందాగా ప్రవర్తించాలని కోరాడు. అయితే వెదర్లాండ్స్‌ ఖవాజాను ఏదో అనబోయి.. వెనక్కి తగ్గాడు. ఇదంతా చూసిన అంపైర్‌ వెదర్లాండ్స్‌ను పిలిచి ఇలా చేయడం కరెక్టు కాదని హెచ్చరించడంతో వివాదం సద్దుమణిగింది.

చదవండి:  నెరవేరిన అయ్యర్‌ కల.. దిగ్గజ క్రికెటర్‌ చేతుల మీదుగా క్యాప్‌.. వీడియో

మరిన్ని వార్తలు