ఫైనల్లో సౌజన్య జంట

6 Mar, 2021 05:54 IST|Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి సౌజన్య బవిశెట్టి డబుల్స్‌ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సౌజన్య–ప్రార్థన తొంబారే (భారత్‌) జోడీ 7–6 (9/7), 3–6, 10–8తో యువరాణి బెనర్జీ–వైదేహి చౌదరీ (భారత్‌) ద్వయంపై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో పియా లవ్రిచ్‌ (స్లొవేనియా)–అడ్రియెన్‌ నాగీ (హంగేరి)లతో సౌజన్య–ప్రార్థన తలపడతారు. మరోవైపు మహిళల సింగిల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ అమ్మాయి షేక్‌ హుమేరా క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించింది. హుమేరా 4–6, 6–4, 3–6తో జీల్‌ దేశాయ్‌ (భారత్‌) చేతిలో ఓడిపోయింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు