-

ఇంగ్లండ్‌తో భారత్‌ మ్యాచ్‌ ‘డ్రా’ 

27 Jul, 2023 08:52 IST|Sakshi

బార్సిలోనా: స్పెయిన్‌ హాకీ సమాఖ్య శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న నాలుగు దేశాల అంతర్జాతీయ హాకీ టోర్నీని భారత మహిళల జట్టు ‘డ్రా’తో ప్రారంభించింది. ఇంగ్లండ్‌ జట్టుతో బుధవారం జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌ను భారత్‌ 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఇంగ్లండ్‌ తరఫున హోలీ హంట్‌ ఏడో నిమిషంలో గోల్‌ చేయగా... భారత జట్టుకు లాల్‌రెమ్‌సియామి 41వ నిమిషంలో గోల్‌ సాధించి స్కోరును సమం చేసింది.

చివరి క్వార్టర్‌లో రెండు జట్లకు రెండు చొప్పున పెనాల్టీ కార్నర్‌లు లభించినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఇదే టోర్నీలో పోటీపడుతున్న భారత పురుషుల జట్టు తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌ జట్టు చేతిలో 1–2తో ఓడిపోగా... నెదర్లాండ్స్‌ జట్టుతో జరిగిన రెండో మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది.   
 

మరిన్ని వార్తలు