ధోని అధ్యాయం ఎన్నటికీ చెరిగిపోనిది

18 Aug, 2020 11:59 IST|Sakshi

జులపాల జట్టుతో టీమిండియాలోకి వచ్చి దనాధన్ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు... అనతికాలంలోనే టీమిండియాకు కెప్టెన్‌ అయి 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే వరల్డ్‌ కప్‌, 2013 చాంపియన్స్‌ ట్రోపీ సాధించిపెట్టాడు.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు.. ఒక కెప్టెన్‌గా ఎంతోమంది యువకులను వెలుగులోకి తీసుకొచ్చాడు.. ఇది చదివితే... ఈ పాటికే మీకు అర్థమయి ఉంటుంది ఎవరనేది.. ఎంఎస్‌ ధోని ఆటకు వీడ్కోలు పలికి ఈ రోజుతో నాలుగో రోజు.. ఇప్పటికే అతని గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.. అతని ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

తాజాగా ఎ ట్రిబ్యూట్‌ టూ ఎంఎస్‌ ధోని.. పేరుతో ఐసీసీ యూట్యూబ్‌లో ఒక వీడియోనూ విడుదల చేసింది. 3 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో ధోనికి దిగ్గజ ఆటగాళ్లైనా.. సచిన్‌, కపిల్‌తో పాటు వర్తమాన క్రికెటర్లు ధోనితో తమకున్న అనుభవాలను పంచుకున్నారు. బ్యాక్‌డ్రాఫ్‌లో ధోని ఆడిన కొన్ని మొమొరబుల్‌ షాట్స్‌ను వీడియోలో ఉంచారు.ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌ లిస్టులో ఉంది. ఇప్పటికే ఈ వీడియోను 29లక్షల మంది వీక్షించారు. (చదవండి : 'పాక్‌లో క్రికెట్‌ ఆడేందుకు ఇష్టపడతా')

>
మరిన్ని వార్తలు