'స్టన్నింగ్‌ క్యాచ్‌తో మా గుండెల్ని గెలుచుకున్నావు'

2 Sep, 2021 15:52 IST|Sakshi

అంగవైకల్యం కేవలం శరీరానికి మాత్రమే అని ఒక దివ్యాంగ క్రికెటర్‌ చేసి చూపెట్టాడు. ఒక కాలు లేకపోయిన బౌలింగ్‌ వేయడమేగాక ఒంటిచేత్తో అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  విషయంలోకి వెళితే.. జాతీయ తరహాలో దివ్యాంగుల క్రికెట్‌ పోటీ జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో ఈ మ్యాచ్‌లకు అంపైర్లతో పాటు థర్డ్‌ అంపైర్‌  కూడా ఉన్నారు.

చదవండి: ENG Vs IND Intruder Jarvo: 'ఇంగ్లండ్‌ భయపడింది'.. అందుకే నిషేధం

ఈ  సందర్భంగా ఒక దివ్యాంగ క్రికెటర్‌ తనకు కాలు లేకపోవడంతో కర్ర సాయంతో బౌలింగ్‌ చేశాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ లాంగాన్‌ రీజియన్‌ దిశగా షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి టర్న్‌ బ్యాట్‌కు తగిలి బౌలర్‌ వైపు వెళ్లింది. ఈ నేపథ్యంలో బౌలర్‌ తన కర్రను కిందపడేసి డైవ్‌ చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. ఆ తర్వాత పైకి లేచే ప్రయత్నం చేస్తుండగా.. తన సహచరులు వచ్చి అతన్ని పైకి లేపి అభినందించారు. సదరు దివ్యాంగ క్రికెటర్‌ చేసిన విన్యాసాలు పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. ''నిజంగా అద్బుతం.. స్టన్నింగ్‌ క్యాచ్‌తో మా గుండెల్ని గెలుచుకున్నావు'' అంటూ దక్షిణాఫ్రికా బౌలర్‌ తబ్రెయిజ్‌ షంసీ పేర్కొన్నాడు. ''వైకల్యం అనేది శరీరానికి మాత్రమే.. ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించొచ్చు'' అని న్యూజిలాండ్‌ బౌలర్‌ మెక్లీగన్‌ తెలిపాడు.

చదవండి: CPL 2021: షెఫర్డ్‌ అద్భుత స్పెల్‌..  సూపర్‌ ఓవర్‌లో థ్రిల్లింగ్‌ విక్టరీ

>
మరిన్ని వార్తలు