‘టాప్స్‌’ కొనసాగిస్తాం: అనురాగ్‌ ఠాకూర్‌

16 Aug, 2021 05:02 IST|Sakshi

న్యూఢిల్లీ: విశ్వ క్రీడల్లో పతక విజేతలను తయారు చేసేందుకు ‘టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌’ (టాప్స్‌)ను కొనసాగిస్తామని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్పష్టం చేశారు. 2024–పారిస్, 2028–లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ క్రీడల వరకు ‘టాప్స్‌’ను పొడిగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

భారత ఒలింపిక్‌ సంఘం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో టోక్యో పతక విజేతలకు అనురాగ్‌ ఠాకూర్‌ ప్రోత్సాహకాలు అందజేశారు. ఐఓఏ స్వర్ణ విజేత నీరజ్‌ చోప్రాకు రూ. 75 లక్షలు, ‘రజత’ విజేతలు మీరాబాయి, రవి లకు రూ. 50 లక్షలు చొప్పున, కాంస్యాలు గెలిచిన సింధు, లవ్లీనా, బజరంగ్‌లకు రూ. 25 లక్షలు చొప్పున, హాకీ టీమ్‌ ఈవెంట్‌లో కాంస్యం గెలిచిన జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున బహూకరించారు.

మరిన్ని వార్తలు