Umran Malik: ఎక్స్‌ప్రెస్ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు ఘన స్వాగతం.. వీడియో వైరల్‌

29 May, 2022 18:21 IST|Sakshi

ఐపీఎల్‌లో అదరగొట్టిన జమ్మూ ఎక్స్‌ప్రెస్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తన స్వస్థలమైన గుజ్జర్ నగర్‌కు చేరుకున్నాడు. స్వస్థలంకు చేరుకున్న మాలిక్‌కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అదే విధంగా భారత జట్టుకు ఎంపికైనందుకు మాలిక్‌ను మొహల్లా వెల్ఫేర్ కమిటీ సత్కరించింది. ఈ కార్యక్రమానికి ఉమ్రాన్‌తో పాటు అతని తండ్రి అబ్దుల్ రషీద్ మాలిక్, జిల్లా ఎస్పీ, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాగా ఉమ్రాన్‌తో సెల్ఫీ దిగేందుకు స్థానికులు ఎగబడ్డారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఐపీఎల్‌-2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా రాణించాడు. ఈ ఏడాది సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ఉమ్రాన్‌ 22 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టుకు మాలిక్‌ ఎంపికయ్యాడు. ఇక జూన్‌9న ఢిల్లీ వేదికగా భారత్‌-దక్షిణాఫ్రికా తొలి టీ20 జరగనుంది.

చదవండి: IPL 2022: 'అతడు అద్భుతమైన ఫీల్డర్‌... ఫీల్డింగ్‌ని నేను ఎంజాయ్‌ చేస్తున్నాను'

మరిన్ని వార్తలు