Umran Malik 5 Wickets: ఐదో అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా ఉమ్రాన్‌ మాలిక్‌ కొత్త చరిత్ర

28 Apr, 2022 08:35 IST|Sakshi
PC: IPL Twitter

గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ నిప్పులు చెరిగాడు. ఏకంగా నలుగురు బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్‌ చేసిన ఉమ్రాన్‌ ఐపీఎల్‌లో తొలిసారి ఐదు వికెట్ల ఫీట్‌ సాధించాడు. ఉత్కంఠభరిత పోరులో ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌ ఓడినప్పటికి తన ప్రదర్శనతో ఉమ్రాన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఉమ్రాన్‌ మాలిక్‌ (4-0-25-5) తన ఐపీఎల్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ ప్రదర్శన నమోదు చేశాడు. ఈ నేపథ్యంలోనే ఉమ్రాన్‌ మాలిక్‌ పలు రికార్డులు బద్దలు కొట్టాడు.


PC: IPL Twitter
►ఐపీఎల్‌లో ఐదు వికెట్ల ఫీట్‌ అందుకున్న ఐదో అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా నిలిచాడు. ఉమ్రాన్‌ కంటే ముందు అంకిత్‌ రాజ్‌పుత్‌(5/14 వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌, 2018), వరుణ్‌ చక్రవర్తి(5/20 వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌, 2020), హర్షల్‌ పటేల్‌(5/27 వర్సెస్‌ ముంబై ఇండియన్స్‌, 2021), అర్ష్‌దీప్‌ సింగ్‌(5/32 వర్సెస్‌ రాజస్తాన్‌ రాయల్స్‌, 2021) ఉన్నారు.
►ఎస్‌ఆర్‌హెచ్‌ తరపున ఐపీఎల్‌లో ఐదు వికెట్ల ఫీట్‌ సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఇంతకముందు భువనేశ్వర్‌ కుమార్‌( 2017లో పంజాబ్‌ కింగ్స్‌పై, 5/18) ఉన్నాడు.
►ఎస్‌ఆర్‌హెచ్‌ తరపున బౌలింగ్‌లో బెస్ట్‌ ఫిగర్స్‌ అందుకున్న జాబితాలోనూ ఉమ్రాన్‌ చోటు దక్కించుకున్నాడు. భువనేశ్వర్‌ కుమార​, ఉమ్రాన​ మాలిక్‌, మహ్మద్‌ నబీ ఉన్నారు.
► ఐపీఎల్‌లో ఒక బౌలర్‌ నలుగురు బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్‌ చేయడం  ఇది మూడోసారి. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఉమ్రాన్‌ మాలిక​ నలుగురు బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఇంతకముందు లసిత్‌ మలింగ 2011లో ఢిల్లీ ‍క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో, సిద్దార్థ్‌ త్రివేది 2012లో ఆర్‌సీబీతో మ్యాచ్‌లో నలుగురు బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్‌ చేశారు.

Poll
Loading...
మరిన్ని వార్తలు