Asia Cup 2022: కెప్టెన్‌గా షనక.. ఆసియాకప్‌కు జట్టును ప్రకటించిన శ్రీలంక

20 Aug, 2022 14:23 IST|Sakshi

ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్‌ 2022కు శ్రీలంక తమ జట్టును ప్రకటించింది. 20 మందితో కూడిన జట్టుకు దాసున్‌ షనక కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. దనుంజయ డిసిల్వా, వనిందు హసరంగా, దుష్మంత చమీరా, చమిక కరుణరత్నే , పాతుమ్‌ నిస్సంక, చరిత్‌ అసలంక, దినేష్‌ చండిమల్‌, బానుక రాజపక్సలు పేరున్న ఆటగాళ్లు కాగా..  ఐపీఎల్‌ ద్వారా 'బేబీ మలింగ'గా పిలవబడిన మతీషా పార్థీరానా కూడా జట్టులోకి ఎంపికయ్యాడు. వాస్తవానికి ఆసియా కప్‌ మొదట శ్రీలంక వేదికగా జరగాల్సింది.

కానీ దేశంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభంతో తలెత్తడంతో వేదికను లంక నుంచి యూఏఈకి మార్చారు. ఇక ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్‌ 11 వరకు ఆసియా కప్‌ జరగనుంది. టోర్నీలో ఆరు జట్లు పాల్గొనునుండగా.. ఇప్పటికే భారత్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌లు ఖరారు కాగా.. మిగతా రెండు స్థానాలు కోసం హాంకాంగ్‌, కవైట్‌, సింగపూర్‌, యూఏఈలు పోటీ పడుతున్నాయి.

ఆసియాకప్‌కు శ్రీలంక జట్టు: దాసున్ షనక (కెప్టెన్), ధనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్ (వికెట్‌ కీపర్‌), చరిత్ అసలంక (వైస్‌ కెప్టెన్‌), భానుక రాజపక్స (వికెట్‌ కీపర్‌), అషెన్ బండార, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, జెఫరీ వాండర్‌సే, ప్రవీణ్ ద్వండర్‌సే చమీర, బినుర ఫెర్నాండో, చమిక కరుణరత్నే, దిల్షన్ మదుశంక, మతీష పతిరన, దినేష్ చందిమల్ (వికెట్‌ కీపర్‌), నువానిందు ఫెర్నాండో, కాసున్ రజిత

మరిన్ని వార్తలు