క్రికెటర్లకు షాక్‌.. 2 కి.మీ. దూరాన్ని 8.10 నిమిషాల్లో పూర్తి చేయాలి.. లేదంటే జీతాల్లో కోత!

20 Dec, 2021 11:23 IST|Sakshi

శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఆ జట్టు ఆటగాళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై జట్టు ఆటగాళ్లంతా ఫిట్‌నెస్‌పై దృష్టిసారించాలని, లేక పోతే వాళ్ల జీతాల్లో కోత విధిస్తామని హెచ్చరించింది. నివేదికల ప్రకారం.. ప్రతీ ఆటగాడు 2 కిలోమీటర్ల దూరాన్నికేవలం 8.10 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఒకవేళ రన్‌ పూర్తిచేసే సమయం 8:55 దాటితే సదరు ఆటగాడిని సెలెక్షన్‌కు పరిగణించరు. 8:35 నుంచి 8:55 నిమిషాల‍్లో పూర్తి చేస్తే వాళ్ల జీతాల్లో కోత విధిస్తారు.

ఇక వచ్చే ఏడాదిలో మొత్తంగా నాలుగు సార్లు  యోయో టెస్ట్‌లను శ్రీలంక నిర్వహించనుంది. తొలి ఫిట్‌నెస్‌ టెస్ట్‌ జనవరి7న జరగనుంది. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్‌ బోర్డు ప్రవేశ పెట్టిన కొత్త రూల్స్‌ జనవరి 2022 నుంచి అమలులోకి రానున్నాయి. "ఇకపై ప్రతీ ఆటగాడు 2 కిలోమీటర్ల దూరాన్ని  8.10  నిమిషాలలోపు పూర్తి చేయాలి. ఆటగాళ్లు తమ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాము. 

ఫిట్‌నెస్‌లో లోపాలను అసలు మేము సహించం" అని శ్రీలంక క్రికెట్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక శ్రీలంక జట్టు వచ్చే ఏడాది ఫిభ్రవరిలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో 5 టీ20ల సిరీస్‌ ఆడనుంది. అనంతరం భారత్‌లో పర్యటించనుంది. ఇక శ్రీలంక పురుషుల సీనియర్ జట్టుకు కన్సల్టింగ్ కోచ్‌గా మహేల జయవర్దనే ఇటీవల ఎంపికైన సంగతి తెలిసిందే.

చదవండిBhuvneshwar Kumar: భారత జట్టు డాటర్స్‌ లిస్టులో మరో రాకుమారి.. భువీ కూతురు ఫొటో వైరల్‌!

మరిన్ని వార్తలు