SL vs AFG: ఐపీఎల్‌లో అదరగొట్టాడు.. శ్రీలంక జట్టులో చోటు కొట్టేశాడు!

30 May, 2023 20:49 IST|Sakshi
PC: IPl.com

స్వదేశంలో ఆఫ్గానిస్తాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్‌ ప్రకటించింది. ఈ సిరీస్‌లో భాగంగా ఆఫ్గాన్‌తో మూడు వన్డేలు ఆడనుంది. అయితే ప్రస్తుతం తొలి రెండు వన్డేలకు మాత్రమే జట్టును శ్రీలంక సెలక్టర్లు ఎంపికచేశారు.

ఈ జట్టుకు దాసున్ షనక నాయకత్వం వహించనున్నాడు. ఇక ఈ జట్టులో ఐపీఎల్‌-2023లో అదరగొట్టిన పేసర్‌ మతీషా పతిరానాను చోటుదక్కింది. ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచడంతో పతిరానాకు సెలక్టర్లు పిలుపునిచ్చారు.

ఈ ఏడాది క్యాష్‌రిచ్‌ లీగ్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన జూనియర్‌ మలింగా.. 12 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆఫ్గాన్‌ సిరీస్‌తో పతిరానా వన్డేల్లో శ్రీలంక తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. గతేడాది ఆగస్టులో ఇదే ఆఫ్గాన్‌ జట్టుపై టీ20ల్లో  పతిరానా డెబ్యూ చేశాడు.

మరోవైపు లంక టెస్టు కెప్టెన్‌ దిముత్ కరుణరత్నేకు ఛానాళ్ల తర్వాత వన్డే జట్టులో చోటు దక్కింది. దిముత్ కరుణరత్నే 2021లో చివరిసారిగా వన్డేల్లో లంక తరపున ఆడాడు. అదేవిధంగా స్టార్‌ పేసర్‌ దుష్మంత చమీర కూడా ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు.  

చమీర గాయం కారణంగా గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్‌ జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ వన్డే వరల్డ్‌కప్‌-2023 క్వాలిఫియర్స్‌ సన్నహాకాల్లో భాగంగా జరగనుంది.

సూపర్‌ లీగ్‌ పాయింట్ల పట్టికలో టాప్‌-8 శ్రీలంక లేకపోవడంతో క్వాలిఫియర్స్‌ ఆడనుంది. ఈ క్వాలిఫియర్‌ రౌండ్‌ మ్యాచ్‌లు జూన్ 18 నుంచి జింబాబ్వే వేదికగా జరగనున్నాయి. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొనున్నాయి. వీటిలో రెండు జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి.

ఆఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు లంక జట్టు: దసున్ షనక (కెప్టెన్), కుసల్ మెండిస్, పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, సదీర సమరవిక్రమ, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, దుషాన్ హేమంత, చమిక కరుణరత్నే, పతిరున హేమంత, చమిక కరుణరత్నే, చమీరా, మతీషా పతిరానా, కుమారా, రజితా
చదవండి: IPL 2023: సీఎస్‌కే గెలవగానే.. జడేజా భార్య రివాబా ఏం చేసిందంటే? వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు