T20 WC SL Vs ENG Updates: ఉత్కంఠ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయం.. సెమీస్‌కు

5 Nov, 2022 17:01 IST|Sakshi

ICC Mens T20 World Cup 2022- England vs Sri Lanka Updates: ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. కీలక మ్యాచ్‌లో శ్రీలంకపై 4 వికెట్ల తేడాతో గెలుపొంది గ్రూప్‌-1 నుంచి సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకుంది. ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌ 47 పరుగులతో రాణించగా.. బెన్‌ స్టోక్స్‌ 42 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో బట్లర్‌ బృందం టీ20 ప్రపంచకప్‌-2022 సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక గ్రూప్‌-1 నుంచి న్యూజిలాండ్‌ ఇప్పటికే సెమీస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.

మ్యాచ్‌ స్కోర్లు: 
టాస్‌: శ్రీలంక
శ్రీలంక: 141/8 (20)
ఇంగ్లండ్‌: 144/6 (19.4)

మొయిన్‌ అలీ ఔట్‌
ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో ఇంగ్లండ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. ధనంజయ బౌలింగ్‌లో షనకకు క్యాచ్‌ ఇచ్చి మొయిన్‌ అలీ (1) ఔటయ్యాడు. 15 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 5 వికెట్ల నష్టానికి 113.

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
స్వల్ప లక్ష్య ఛేదనలో లభించిన మెరుపు ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్న ఇంగ్లండ్‌ వరుసగా వికెట్లు కోల్పోతుంది. 14వ ఓవర్‌ తొలి బంతికి కుమార బౌలింగ్‌లో ధనంజయకు క్యాచ్‌ ఇచ్చి లివింగ్‌స్టోన్‌ (4) ఔటయ్యాడు. ఫలితంగా ఇంగ్లండ్‌ 106 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది.  

బ్రూక్‌ అవుట్‌
డిసిల్వ బౌలింగ్‌లో బ్రూక్‌(4) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. స్టోక్స్‌, లివింగ్‌స్టోన్‌ క్రీజులో ఉన్నారు. స్కోరు: 93/3 (11.1)

రెండో వికెట్‌ డౌన్‌
అర్ధ శతకానికి చేరువగా ఉన్న హేల్స్‌(47)ను హసరంగ బౌల్డ్‌ చేశాడు. పదో ఓవర్‌ తొలి బంతికే అతడిని పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఇంగ్లండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. స్కోరు: 82/2 (9.1). బ్రూక్‌, స్టోక్స్‌ క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ రూపంలో ఇంగ్లండ్‌ మొదటి వికెట్‌ కోల్పోయింది. 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ ఓపెనర్‌ హసరంగ బౌలింగ్‌లో కరుణరత్నెకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. స్టోక్స్‌ క్రీజులోకి వచ్చాడు.

పవర్‌ ప్లేలో ఇంగ్లండ్‌ స్కోరెంతంటే!
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు బట్లర్‌, అలెక్స్‌ హేల్స్‌ శుభారంభం అందించారు. లంక బౌలర్లుకు చుక్కలు చూపిస్తూ వీలు చిక్కినప్పుడల్లా బంతికి బౌండరీకి తరలిస్తూ పరుగులు పిండుకుంటున్నారు. పవర్‌ ప్లే ముగిసే సరికి ఇంగ్లండ్‌ స్కోరు: 70/0 (6). బట్లర్‌ 25, అలెక్స్‌ హేల్స్‌ 42 పరుగులతో క్రీజులో ఉన్నారు.

సెమీస్‌ చేరాలంటే చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంకను తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగంది ఇంగ్లండ్‌. దీంతో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న లంక.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ పాతుమ్‌ నిసాంక 67 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఆఖరి ఓవర్లో
చివరి ఓవర్లోనే లంక రాజపక్స, హసరంగ,  కరుణరత్నె వికెట్లు కోల్పోయింది. 

రాజపక్స అవుట్‌
రాజపక్స(22) రూపంలో ఆరో వికెట్‌ కోల్పోయింది.  హసరంగ, కరుణరత్నె క్రీజులో ఉన్నారు.

నిరాశ పరిచిన కెప్టెన్‌
లంక కెప్టెన్‌ దసున్‌ షనక మూడు పరుగులకే పెవిలియన్‌ చేరాడు. మార్క్‌ వుడ్‌ బౌలింగ్లో అతడు వెనుదిరగడంతో లంక ఐదో వికెట్‌ కోల్పోయింది. స్కోరు: 128/5 (18). హసరంగ, రాజపక్స క్రీజులో ఉన్నారు.

నిసాంక ఇన్నింగ్స్‌కు బ్రేక్‌ వేసిన రషీద్‌
ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో నిసాంక(67) అవుటయ్యాడు. దీంతో లంక నాలుగో వికెట్‌ కోల్పోయింది. స్కోరు- 118/4 (15.3). రాజపక్స, దసున్‌ షనక క్రీజులో ఉన్నారు.

అర్ధ శతకంతో జోరు మీదున్న నిసాంక
14 ఓవర్లలో శ్రీలంక స్కోరు: 104/3. భనుక రాజపక్స 7, పాతుమ్‌ నిసాంక 60 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన లంక
స్టోక్స్‌ బౌలింగ్‌లో మలన్‌కు క్యాచ్‌ ఇచ్చిన అసలంక(8) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. 
10 ఓవర్లలో స్కోరు: 80-2

A post shared by ICC (@icc)

A post shared by ICC (@icc)

రెండో వికెట్‌ కోల్పోయిన లంక
డిసిల్వ(9) రూపంలో లంక రెండో వికెట్‌ కోల్పోయింది. అసలంక క్రీజులోకి వచ్చాడు.

దంచి కొడుతున్న నిసాంక
8 ఓవర్లలో లంక స్కోరు: 71-1. నిసాంక 42, డిసిల్వ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.

పవర్‌ ప్లే ముగిసే సరికి లంక స్కోరు: 54/1 (6)

తొలి వికెట్‌ కోల్పోయిన లంక
లంక ఓపెనర్‌ కుశాల్‌ మెండిస్‌(18).. క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో లివింగ్‌స్టన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీంతో శ్రీలంక తొలి వికెట్‌ కోల్పోయింది. 4 ఓవర్లు ముగిసే సరికి లంక స్కోరు:  39-1. పాతుమ్‌ నిసాంక 19, ధనుంజ డి సిల్వా 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఇంగ్లండ్‌కు చావో రేవో
టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్‌-12 గ్రూప్‌-1లో శ్రీలంకతో మ్యాచ్‌ ఇంగ్లండ్‌కు చావో రేవోలా తయారైంది. లంకపై గెలిస్తేనే ఇంగ్లండ్‌ సెమీస్‌ చేరుతుంది. ఓడితే మాత్రం ఆస్ట్రేలియా సెమీస్‌కు.. ఇంగ్లండ్‌ ఇంటికి వెళ్లనుంది. ఇక టాస్‌ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌లో కచ్చితంగా ఇంగ్లండ్‌ ఫేవరెట్‌ అని చెప్పొచ్చు.

వర్షం అంతరాయం వల్ల ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఓడిన ఇంగ్లండ్‌.. నాలుగు మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఒక ఓటమితో ఉంది. అయితే నెట్‌ రన్‌రేట్‌ ప్లస్‌లో ఉండడం ఇంగ్లండ్‌కు సానుకూలాంశం. లంకపై సాధారణ విజయం నమోదు చేసినా ఇంగ్లీష్‌ జట్టు సెమీస్‌కు చేరుకుంటుంది. అంతిమంగా ఇంగ్లండ్‌కు కావాల్సింది విజయం. 

ఇంగ్లండ్: జోస్ బట్లర్(వికెట్‌ కీపర్‌, కెప్టెన్‌), అలెక్స్ హేల్స్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, సామ్ కర్రాన్, డేవిడ్ మలన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్‌

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్‌ కీపర్‌), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక(కెప్టెన్‌), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, లహిరు కుమార, కసున్ రజిత

ఇక ఇంగ్లండ్‌ జట్టులో హిట్టర్లకు కొదువ లేదు. బ్యాటింగ్‌లో తొలి స్థానం నుంచి 10వ స్థానం వరకు బ్యాటింగ్‌ చేయగల సమర్థులు జట్టులో ఉన్నారు. బట్లర్‌, స్టోక్స్‌, అలెక్స్‌ హేల్స్‌, డేవిడ్‌ మలన్‌లతో టాపార్డర్‌ పటిష్టంగా కనిపిస్తుండగా.. మిడిలార్డర్‌లో లివింగ్‌స్టోన్‌, హ్యారీ బ్రూక్‌, మొయిన్‌ అలీలు ఉన్నారు. ఇక బౌలింగ్‌లో మార్క్‌వుడ్‌, క్రిస్‌ వోక్స్‌, సామ్‌ కరన్‌లు తమ పేస్‌ పదును చూపిస్తుండగా.. ఆదిల్‌ రషీద్‌ స్పిన్‌తో అదరగొడుతున్నాడు.

అటు శ్రీలంక మాత్రం ఈ మ్యాచ్‌లో గెలిచి ఇంగ్లండ్‌ను తమతో పాటు ఇంటికి తీసుకుపోవాలని భావిస్తుంది. అయితే లంక జట్టు ప్రస్తుతం అనుకున్న రీతిలో ఆడడం లేదు. ఆటగాళ్ల గాయాలు జట్టును బాగా దెబ్బతీశాయి. విజయంతో టోర్నీని ముగించాలని లంక ఆశిస్తుంది. 

► ఇరుజట్ల రికార్డులు పరిశీలిస్తే.. ఇప్పటివరకు ముఖాముఖి పోరులో 13 సార్లు తలపడగా ఇంగ్లండ్‌ 9సార్లు.. శ్రీలంక నాలుగుసార్లు నెగ్గాయి.

>
మరిన్ని వార్తలు