అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీలంక బౌలర్‌ గుడ్‌బై

19 Feb, 2021 19:57 IST|Sakshi

కొలంబో: శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ధమ్మిక ప్రసాద్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2006లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసిన 37 ఏళ్ల ధమ్మిక 25 టెస్టుల్లో 75 వికెట్లు,24 వన్డేల్లో 32 వికెట్లు తీశాడు. కాగా ప్రసాద్‌ చివరి టెస్టును 2015లో విండీస్‌తో ఆడాడు. అదే ఏడాది 9 టెస్టుల్లో ఏకంగా 41 వికెట్లు పడగొట్టి ఆ ఏడాది టాప్-10 బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ఆ తర్వాత భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ధమ్మిక అప్పటినుంచి క్రమక్రమంగా జట్టుకు దూరమవుతూ వచ్చాడు.

కాగా ధమ్మిక రిటైర్మెంట్‌ సందర్భంగా అతని సేవలను గుర్తు చేసుకుంటూ శ్రీలంక క్రికెట్‌ బోర్డ్‌ ట్విటర్‌లో వీడియో షేర్‌ చేసింది. 2015లో భారత్‌తో స్వదేశంలో జరిగిన మూడు టెస్టుల్లో ధమ్మిక ప్రసాద్ 15 వికెట్లు పడగొట్టాడు. 2002 నుంచి సింఘలీస్ స్పోర్ట్స్ క్లబ్ క్రికెట్ గ్రౌండ్ (ఎస్ఎస్‌సీ)కి ప్రాతినిధ్యం వహిస్తున్న ధమ్మిక 130 ఫస్ట్‌క్లాస్ గేముల్లో 351 వికెట్లు పడగొట్టాడు. 
చదవండి: ఆ సమయంలో ఎవరూ లేరు: కోహ్లి
'రోహిత్‌, పాండ్యా గట్టిగా హగ్‌ చేసుకున్నారు'

మరిన్ని వార్తలు