IPL 2022: సీఎస్‌కేకు మరో బిగ్‌ షాక్‌.. ఆ ఒక్కడు కూడా..!

27 Apr, 2022 17:08 IST|Sakshi
Photo Courtesy: IPL

Ambati Rayudu Injury: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో ఐపీఎల్ 2022 సీజన్ బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏదీ కలిసి రావట్లేదు. ఓ పక్క వరుస పరాజయాలు, మరో పక్క గాయాల బెడద ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ ఆశలకు దాదాపుగా గండికొట్టాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న ఆ జట్టుకు తాజాగా మరో బిగ్‌ షాక్‌ తగిలింది. 

మిడిలార్డర్‌లో అడపాదడపా రాణిస్తున్న అంబటి రాయుడు గాయం బారిన పడ్డాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా అతని గాయం తీవ్రతరమైందని ఆ జట్టు హెడ్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ వెల్లడించాడు. ఆ మ్యాచ్‌లో సుడిగాలి ఇన్నింగ్స్‌(39 బంతుల్లో 78; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆడి ప్రత్యర్ధికి ముచ్చెమటలు పట్టించిన రాయుడికి అప్పటికే గాయమైందని, గాయంతోనే అతను బ్యాటింగ్ కొనసాగించాడని, దాంతో గాయం మరింత తీవ్రమైందని ఫ్లెమింగ్‌ తెలిపాడు. మే 1న సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ సమయానికి రాయుడు కోలుకుంటాడన్న నమ్మకం లేదని ఆయన పేర్కొన్నాడు. 

స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ ఇచ్చిన అప్‌డేట్‌ను బట్టి చూస్తే.. సీఎస్‌కే ఆడబోయే తదుపరి మ్యాచ్‌లకు రాయుడు అందుబాటులో ఉండడని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుత సీజన్‌లో రాయుడు 8 మ్యాచ్‌ల్లో 35.14 సగటున 129.47 స్ట్రైక్‌ రేట్‌తో 246 పరుగులు చేశాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్ 78. ఇదిలా ఉంటే, రాయుడుతో కలుపుకుని ఈ సీజన్‌లో గాయాల కారణంగా సీఎస్‌కేకు దూరమైన ఆటగాళ్ల సంఖ్య మూడుకి చేరింది. తొలుత దీపక్‌ చాహర్‌, ఆ తర్వాత ఆడమ్‌ మిల్నే గాయాల కారణంగా వైదొలిగారు.
చదవండి: ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్‌గా అతడే.. హెడ్‌కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్‌!

మరిన్ని వార్తలు