Steve Smith- IPL 2023: నమస్తే ఇండియా! తిరిగి వచ్చేస్తున్నా.. అద్భుతమైన జట్టుతో..

27 Mar, 2023 14:30 IST|Sakshi

Steve Smith to join IPL 2023: ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఐపీఎల్‌-2023 సీజన్‌లో భాగం కానున్నాడు. ఈ విషయాన్ని స్మిత్‌ స్వయంగా ప్రకటించాడు. ‘‘నమస్తే ఇండియా. మీతో ఓ ఆసక్తికర వార్త పంచుబోతున్నా. నేను ఐపీఎల్‌-2023 ఎడిషన్‌లో జాయిన్‌ అవుతున్నా. అవును.. ఇది నిజమే! ఇండియాలోని అద్భుతమైన టీమ్‌తో నేను జట్టుకట్టనున్నాను’’ అంటూ వీడియో విడుదల చేశాడు.

కాగా స్మిత్‌ గతంలో క్యాష్ రిచ్‌ లీగ్‌లో ఆరు ఫ్రాంఛైజీల తరఫున ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సహా ప్రస్తుతం ఉనికిలో లేని రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌, పుణె వారియర్స్‌ ఇండియా, కొచ్చి టస్కర్స్‌ కేరళ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.

2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చినా
గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగిన 33 ఏళ్ల స్మిత్‌.. 8 మ్యాచ్‌లు ఆడి 152 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో మొత్తంగా 103 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆసీస్‌ బ్యాటర్‌.. 2485 పరుగులు సాధించాడు. ఇందులో 11 అర్ధ శతకాలు, ఒక సెంచరీ ఉన్నాయి. ఇక గతేడాది 2 కోట్ల రూపాయల కనీస ధరతో వేలంలోకి వచ్చిన స్టీవ్‌ స్మిత్‌.. అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.

టీమిండియాతో సిరీస్‌లో కెప్టెన్‌గా హిట్‌
ఈ నేపథ్యంలో కామెంటేటర్‌గా కొత్త అవతారం ఎత్తనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌తో కామెంటేటర్‌గా అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. ఇక ఇటీవల టీమిండియాతో ముగిసిన బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 టెస్టు సిరీస్‌లో ప్యాట్‌ కమిన్స్‌ గైర్హాజరీలో స్మిత్‌ పగ్గాలు చేపట్టి.. మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. తన కెప్టెన్సీ నైపుణ్యాలతో మూడో టెస్టులో ఆసీస్‌ను గెలిపించాడు. ఇక అతడి సారథ్యంలోనే టీమిండియాను ఓడించి ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ సొంతం చేసుకుంది.

చదవండి: SA vs WI: చరిత్ర సృష్టించిన డికాక్‌.. టీ20ల్లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ!
BCCI: భువనేశ్వర్‌కు బిగ్‌ షాకిచ్చిన బీసీసీఐ.. ఇక మర్చిపోవడమే!

మరిన్ని వార్తలు