మేమేంటో మా ఇద్దరికి మాత్రమే తెలుసు

10 Sep, 2020 13:41 IST|Sakshi

లండన్‌ : విరాట్‌ కోహ్లి, స్టీవ్‌ స్మిత్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమి లేదు. ఎవరి బ్యాటింగ్‌ స్టైల్‌ వారిది.. ఒకరిది దూకుడు స్వభావం అయితే..మరొకరు నెమ్మదైన స్వభావంతో కనిపిస్తారు. ప్రస్తుత తరంలో బ్యాటింగ్‌లో వండర్స్‌ క్రియేట్‌ చేసే ఈ ఇద్దరు పరుగులు చేయడంలో పోటీ పడతారేమో గాని గౌరవించుకోవడంలో ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి.

2019 ప్రపంచకప్‌ సందర్భంగా ఆస్ట్రేలియాతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో  బ్యాల్‌ టాంపరింగ్‌ వివాదంలో ఏడాది నిషేదం ఎదుర్కొన్న స్మిత్‌ను ఉద్దేశించి భారత అభిమానులు గేలి చేశారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న విరాట్‌ కోహ్లి.. మానిన పాత గాయాన్ని మళ్లీ గుర్తుచేయడం మంచి విషయం కాదు.. ఆ బాధ నుంచి తొందరగా బయటపడాలని కోరుకుంటూ క్లాప్స్‌తో ఎంకరేజ్‌ చేయాలంటూ తెలిపాడు. ఆరోజు స్మిత్‌ మ్యాచ్‌ ముగిసిన తర్వాత కోహ్లి దగ్గరికి వెళ్లి కృతజ్ఞత తెలిపాడు. (చదవండి: మా జట్టు ఈసారి కచ్చితంగా కప్‌ కొడుతుంది)

తాజాగా  మూడు వన్డే మ్యాచ్‌లు ఆడేందుకు ఆసీస్‌ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రిపరేషన్‌ ప్లాన్‌లో ఉన్న స్మిత్‌ బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. మీ దృష్టిలో వన్డేలో గొప్ప బ్యాట్స్‌మన్‌ పేరు చెప్పండి అని అడగ్గానే.. స్మిత్‌ ఏ మాత్రం సంకోచం లేకుండా విరాట్‌ కోహ్లి పేరు చెప్పాడు.

'ఈ దశాబ్దంలోనే కోహ్లి వన్డేలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. అతని మీద నాకు ఉండే గౌరవం వేరు. అది మా ఇద్దరికి మాత్రమే తెలుసు' అంటూ తెలిపాడు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. కోహ్లి అంటే స్మిత్‌కు ఎంత గౌరవమో. అంతేకాదు కోహ్లి ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్‌సీబీ జట్టులో సహచర ఆటగాడైన దక్షిణాఫ్రికా స్టార్‌ ఏబీ డివిలియర్స్‌ గురించి ఒక్క వ్యాఖ్యంలో చెప్పగలరా అంటూ మరొకరు అడిగారు. దానికి స్మిత్‌..' డివిలియర్స్‌ ఈజ్‌ ఫ్రీక్' అని సమాధానమిచ్చాడు.

ఇక భారత క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే వెలుగొందుతున్న కేఎల్‌ రాహుల్‌, సంజూ శామ్సన్‌ల గురించి స్మిత్‌ వద్ద ప్రస్తావించగా.. కేఎల్‌ రాహుల్‌ 'గన్‌' లాంటి వాడని.. శాంసన్‌ 'టాలెంటడ్‌ ప్లేయర్‌' అని చెప్పాడు. ఇక రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుకు స్మిత్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అదే జట్టులో ఇంగ్లండ్‌ ప్లేయర్‌ జాస్‌ బట్లర్‌ కూడా ఉన్నాడు. టీ20 ల్లో మంచి ఫామ్‌లో ఉన్న బట్లర్‌ ఐపీఎల్‌లో జట్టుకు కీలకం కానున్నాడు.. బట్లర్‌పై మీ అభిప్రాయం ఏంటని స్మిత్‌ను అడిగారు.

దీనికి స్మిత్ స్పందిస్తూ.. 'బట్లర్‌.. నిజంగా టెర్రిఫిక్‌ ప్లేయర్‌.. అందులో సందేహం లేదు.. రేపు జరగబోయే వన్డేల్లో మాత్రం అతన్ని పరుగులు చేయకుండా అడ్డుకుంటాం.. ఐపీఎల్‌లో మాత్రం అతన్ని అడ్డుకోనూ.. ఎందుకంటే ఇద్దరం ఒకేజట్టుకు ఆడతాం కాబట్టి 'అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ ముగిసిన తర్వాత సెప్టెంబర్‌ 16న స్మిత్‌ రాజస్తాన్‌ రాయల్స్‌తో జట్టుతో కలవనున్నాడు. కాగా ఐపీఎల్‌ 2020లో రాజస్తాన్‌ రాయల్స్‌ తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్‌ 22న చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఆడనుంది.( చదవండి : ఈసారి ఐపీఎల్‌ టైటిల్‌ వారిదే: బ్రెట్‌ లీ)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు