SL Vs AUS - Steve Smith: 18 నెలల తర్వాత సెంచరీ చేసిన స్మిత్‌.. వీడియో వైరల్‌

8 Jul, 2022 21:25 IST|Sakshi

ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాడు స్టీవన్‌ స్మిత్‌ ఎట్టకేలకు సెంచరీ సాధించాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో స్మిత్‌ అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు. దీంతో అతడి 18 నెలల నిరీక్షణకు తెరపడింది. ఈ మ్యాచ్‌లో 193 బంతుల్లో అతడు శతకాన్ని సాధించాడు. ఇక తన టెస్టు కెరీర్‌లో స్మిత్‌కు ఇది 28వ సెంచరీ. 2021లో భారత్‌తో జరిగిన సిడ్నీ టెస్టులో అంతర్జాతీయ క్రికెట్‌లో స్మిత్ తన చివరి సెంచరీ సాధించాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.

క్రీజులో స్మిత్‌(109), కారీ(16) పరుగులతో ఉన్నారు. కాగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. ఓపెనర్లు  డేవిడ్ వార్నర్( 5), ఉస్మాన్ ఖవాజా(37) రాణించక పోవడంతో 70 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ కలిసి మూడో వికెట్‌కి 134 పరుగుల భాగస్వామ్యంతో జట్టును అదుకున్నారు. ఈ క్రమంలో విదేశీ గడ్డపై తొలి సెంచరీను లబుషేన్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 104 పరుగులు సాధించిన లబుషేన్ ప్రబాత్ జయసూర్య బౌలింగ్‌లో ఔటయ్యాడు. శ్రీలంక బౌలర్లలో జయసూర్య మూడు వికెట్లు, రజితా, మెండీస్‌ తలా వికెట్‌ సాధించారు.
చదవండి: IND vs ZIM: ఆరేళ్ల తర్వాత జింబాబ్వే పర్యటనకు టీమిండియా..!

మరిన్ని వార్తలు