Stuart Broad: ముప్పతిప్పలు పెట్టి తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు..

25 Aug, 2022 22:24 IST|Sakshi

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ బౌలర్లు ప్రొటిస్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఇంగ్లండ్‌ బౌలర్ల దాటికి తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 151 పరుగులకే ఆలౌట్‌ అయింది. రబడా 36 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. ఇంగ్లండ్‌ బౌలర్లలో అండర్సన్‌ 3, బ్రాడ్‌ 3, బెన్‌ స్టోక్స్‌ రెండు వికెట్లు తీశారు. ఈ విషయం పక్కనబెడితే.. ఇంగ్లండ్‌ సీనియర్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌.. దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ను ఔట్‌ చేసిన విధానం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే ఎల్గర్‌ ఔట్‌ అనుకుంటే పొరపాటే.. ఎల్గర్‌ను పెవిలియన్‌కు చేర్చే క్రమంలో స్టువర్ట్‌ బ్రాడ్‌ సెట్‌ చేసుకున్న బౌలింగ్‌ హైలైట్‌ అని చెప్పొచ్చు. అప్పటికే అండర్సన్‌ సరేల్‌ ఎర్వీ(3)ని ఇన్నింగ్స్‌ల ఐదో ఓవర్‌లో వెనక్కి పంపించాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌కు స్టువర్ట్‌ బ్రాడ్‌ ఇన్నింగ్స్‌ 13వ ఓవర్లో ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి చివరకు తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. ఆ ఓవర్లో ఎల్గర్‌ ఔటైన ఐదో బంతి వరకు దాదాపు అన్నీ ఒకే విధంగా ఉండడం విశేషం.  ఆ ఓవర్‌లో తొలి నాలుగు బంతుల్లో రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఎల్గర్‌.. చివరకు ఐదో బంతికి దొరికిపోయాడు. గుడ్‌లెంగ్త్‌తో రౌండ్‌ ది వికెట్‌ వేసిన బంతిని ఎల్గర్‌ టచ్‌ చేయగా నేరుగా బెయిర్‌​స్టో చేతుల్లో పడింది. 

చదవండి: ENG Vs SA 2nd Test: చెలరేగిన ఇంగ్లండ్‌ బౌలర్లు.. సౌతాఫ్రికా 151 ఆలౌట్‌

James Anderson: జేమ్స్‌ అండర్సన్‌ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు

మరిన్ని వార్తలు