IND Vs ENG: టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే బ్రాడ్‌ అత్యంత చెత్త రికార్డు.. తొలి బౌలర్‌గా..!

2 Jul, 2022 17:03 IST|Sakshi

టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును ఇంగ్లండ్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ నమోదు చేశాడు. టెస్టుల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా బ్రాడ్‌ నిలిచాడు. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా టీమిండియాతో జరుగుతోన్న ఐదో టెస్టులో 84 ఓవర్‌ వేసిన బ్రాడ్‌.. ఏకంగా 35 పరుగులు సమర్పించుకుని ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఓవర్‌లో టీమిండియా కెప్టెన్‌ జస్ప్రీత్ బుమ్రా 29 పరుగుల రాబట్టగా, 6 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి.

అంతకు ముందు 2003లో దక్షిణాఫ్రికా బౌలర్‌ ఆర్‌ పీటర్సన్‌ ఒకే ఓవర్‌లో 28 పరుగులు ఇచ్చాడు. ఇప్పడు బ్రాడ్‌ 35 పరుగులు ఇచ్చిఈ చెత్త రికార్డును తన పేరిట లిఖించికున్నాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 416 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నిం‍గ్స్‌లో రిషబ్‌ పంత్‌(146), జడేజా(104) పరుగులతో రాణించారు. ఇక ఇంగ్లండ్‌ బౌలర్లలో జేమ్స్‌ అండర్సన్‌ 5 వికెట్లు, పొట్స్‌ 2 వికెట్లు,బ్రాడ్‌,రూట్‌,స్టోక్స్‌ తలా వికెట్‌ సాధించారు.
చదవండి: ENG vs IND: టెస్టుల్లో జడేజా అరుదైన ఫీట్‌.. నాలుగో భారత ఆటగాడిగా..!

మరిన్ని వార్తలు