టీమిండియా హోం అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకుంది: బ్రాడ్‌

21 Feb, 2021 16:26 IST|Sakshi

అహ్మదాబాద్‌: మూడో టెస్టు ప్రారంభానికి ముందు ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో​ టీమిండియా హోం అడ్వాంటేజ్‌ను చక్కగా ఉపయోగించుకుందని పేర్కొన్నాడు. మూడోటెస్టు కోసం సన్నద్దమవుతున్న బ్రాడ్‌ డెయిలీ మొయిల్‌లో ఈ వ్యాఖ్యలు చేశాడు.

'రెండో టెస్టులో మా జట్టు ఓటమికి నేను పిచ్‌ను తప్పుబట్టలేను.  నా దృష్టిలో టీమిండియా హోం అడ్వాంటేజ్‌ను చక్కగా ఉపయోగించుకుంది. రెండో టెస్టులో టీమిండియా మొదట బ్యాటింగ్‌ చేసి మా మీద ఒత్తిడి పెంచేసింది. నైపుణ్య విషయంలో వారు మమల్ని అధిగమించారు. పిచ్‌ పరిస్థితిని అర్థం చేసుకొని టీమిండియా ఆడితే.. మేం మాత్రం అంచనా వేయలేక చతికిలపడ్డాం. అంతేకానీ పిచ్‌పై ఎలాంటి విమర్శలు లేవు. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై అశ్విన్‌తో పాటు మా బౌలర్లు చెలరేగారు. 2018లో లార్డ్స్‌లో జరిగిన టెస్టులోనూ తాము ఇలాగే హోమ్‌ అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకున​ఆనం. స్వింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌పై టీమిండియా రెండు ఇన్నిం‍గ్స్‌లోనూ తక్కువ స్కోరుకే ఆలౌట్‌ కావడంతో ఇన్నింగ్స్‌ తేడాతో విజయం సాధించాం.

మేమే కాదు.. ఆసీస్‌, దక్షిణాఫ్రికా ఇలా ఏ జట్టు తీసుకున్నా వారి సొంతగడ్డపై ఇలాగే చేస్తారు. ఒకవేళ అహ్మదాబాద్‌ టెస్టుకు తుది జట్టులో ఉంటే మాత్రం పింక్‌బాల్‌ టెస్టులో స్వింగ్‌ రాబట్టే అవకాశం ఉంది.  అయితే రెండో టెస్టులో లెగ్‌ స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే బౌలింగ్‌ శైలి వేయడం వెనుక ఒక కారణం ఉంది. మేం మ్యాచ్‌లో నిలవడానికి లెగ్‌ కట్టర్స్‌ అవసరమవ్వొచ్చన్న ఆలోచనతోనే కుంబ్లే బౌలింగ్‌ను అనుకరించాను తప్ప వేరే ఉద్దేశం లేదు.'అని చెప్పుకొచ్చాడు.

కాగా ఇరుజట్ల మధ్య మూడో టెస్టు అహ్మదాబాద్‌ వేదికగా ఫిబ్రవరి 24వ తేదీ నుంచి డే నైట్‌ తరహాలో జరగనుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌ను గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. కాగా రొటేషన్‌ పాలసీ ప్రకారం మూడో టెస్టుకు తుది జట్టులో బ్రాడ్‌ చోటు దక్కించుకుంటాడా లేదా అన్నది చూడాలి. ఇంగ్లండ్‌ తరపున బ్రాడ్‌ 165 టెస్టుల్లో 517 వికెట్లు, 121 వన్డేల్లో 178 వికెట్లు, 56 టీ20ల్లో 65 వికెట్లు తీశాడు.
చదవండి: విదేశీ బౌలర్లకు అంత ఇచ్చి.. అతనికి ఇంత తక్కువ
ఇన్నాళ్ల నిరీక్షణ ముగిసింది.. కంగ్రాట్స్‌ సూర్య 

మరిన్ని వార్తలు