స్మిత్‌ కళ్లు చెదిరే క్యాచ్‌.. షాక్‌లో అయ్యర్‌

29 Nov, 2020 15:49 IST|Sakshi

సిడ్నీ : ఆసీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్ భారత్‌తో సిరీస్‌కు ప్రమాదకరంగా మారుతున్నాడు. తాజాగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో మొదట బ్యాటింగ్‌లో అదరగొట్టిన స్మిత్‌ తర్వాత ఫీల్డింగ్‌లోనూ రెచ్చిపోయాడు. హెన్రిక్స్‌ బౌలింగ్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌ కొట్టిన షాట్‌ను స్మిత్‌ అద్భుతరీతిలో డైవ్‌ చేస్తూ కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకున్నాడు. స్మిత్‌ అందుకున్న తీరు చూస్తే అతను ఎంత కసిగా ఆడుతున్నాడో స్పష్టమైంది. స్మిత్‌ పట్టిన క్యాచ్‌తో షాక్‌కు గురైన అయ్యర్‌ నిరాశతో పెవిలియన్‌ బాట పట్టాడు. దీంతో ప్రమాదకరంగా మారుతున్న కోహ్లి, అయ్యర్‌ జోడిని విడదీసినట్లయింది.

అంతకముందు 390 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 60 పరుగుల వద్ద ఓపెనర్లను కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన కోహ్లి, అయ్యర్‌లు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. వీరిద్దరు నిలదొక్కుకొని ప్రమాదకరంగా మారుతున్న దశలో  స్మిత్‌ అద్భుత క్యాచ్‌తో శ్రేయాస్‌ అయ్యర్‌ వెనుదిరగడంతో 153 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 31 ఓవర్లలో 190 పరుగులు చేసింది. కోహ్లి 75, రాహుల్‌ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. (చదవండి : 46 బంతుల్లో సెంచరీ.. కివీస్‌దే సిరీస్‌)

కాగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో స్టీవ్‌ స్మిత్‌ వరుసగా రెండో సెంచరీ సాధించాడు. మొదటి వన్డేలో 66 బంతుల్లో 105 పరుగులు చేసిన స్మిత్‌ రెండో వన్డేలో మరింత దూకుడుగా ఆడాడు. కేవలం 62 బంతుల్లోనే 100 పరుగులు సాధించిన స్మిత్‌ 104 పరుగుల వద్ద ఔట్‌గా వెనుదిరిగాడు. స్మిత్‌ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. తొలి 50 పరుగులను 38 బంతులు తీసుకున్న స్మిత్‌ మలి 50 పరుగులను కేవలం 24 బంతుల్లోనే సాధించడం విశేషం. (చదవండి : వారెవ్వా అయ్యర్‌.. వాట్‌ ఏ త్రో)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా