IPL 2022: "బ్యాటింగ్‌లో చెత్తగా ఆడాం.. బౌలర్లు అద్భుతంగా రాణించారు"

30 Apr, 2022 12:15 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌-2022లో భాగంగా శుక్రవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో ఆదిలోనే రాహుల్‌ వికెట్‌ కోల్పోయింది. అనంతరం డికాక్‌, దీపక్‌ హుడా లక్నో ఇన్నింగ్స్‌ చక్క దిద్దారు. దీంతో ఒకనొక దశలో లక్నో వికెట్‌ నష్టానికి 98 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. తర్వాత కేవలం 15 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోయిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేయగల్గింది. కాగా మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ .. తమ బ్యాటింగ్‌ పట్ల ఆసంతృప్తి వ్యక్తం చేశాడు.

మిడిలార్డర్‌లో బ్యాటర్లు రాణించి ఉంటే 180 నుంచి 190 పరుగులు మధ్య సాధించి ఉండేవాళ్లమని రాహుల్‌ తెలిపాడు. "తొలి ఇన్నింగ్స్‌ అఖరిలో మా బ్యాటర్ల ఆట తీరు నన్ను నిరాశ పరిచింది. మేము ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో అంతగా రాణించలేకపోయాం. రాబోయే మ్యాచ్‌ల్లో మేము బ్యాటింగ్‌పై దృష్టి సారించాలి. మ్యాచ్‌ హాఫ్ టైమ్ వరకు మేము బ్యాటింగ్‌లో మెరుగైన స్ధితిలో ఉన్నాం.

డికాక్‌, దీపక్ హుడా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. మిగితా బ్యాటర్లు రాణించి ఉంటే 180 నుంచి 190 పరుగుల మధ్య సాధించేవాళ్లం. ఈ మ్యాచ్‌లో మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. బౌలింగ్‌ పరంగా మేము అత్యత్తుమంగా ఉన్నాం. ఇక కృనాల్ పాండ్యా టోర్నో అద్భుతంగా రాణిస్తున్నాడు. కీలక సమయాల్లో అతడు వికెట్లు అందిస్తున్నాడని"  రాహుల్‌ పేర్కొన్నాడు.

చదవండి:IPL 2022: బౌండరీ దగ్గర నుంచి డైరెక్ట్ త్రో.. పాపం దీపక్‌ హుడా.. వీడియో వైరల్‌..!

మరిన్ని వార్తలు