నిషేధ కాలం తగ్గించండి: భారత రెజ్లర్‌ సుమిత్‌ అప్పీల్‌

6 Jul, 2021 05:31 IST|Sakshi

డోపింగ్‌లో పట్టుబడటంతో రెండేళ్ల నిషేధానికి గురైన భారత రెజ్లర్‌ సుమిత్‌ మలిక్‌... నిషేధ కాలాన్ని తగ్గించాలంటూ యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ)కు అప్పీల్‌ చేయనున్నాడు. తను తీసుకున్న ఔషధాల్లో నిషేధిత ఉత్ప్రేరకం కలిసి వుండవచ్చని అంగీకరించిన రెజ్లర్‌ విధించిన నిషేధాన్ని ఏడాదికి తగ్గిస్తే వచ్చే ఏడాది కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాడు. 125 కేజీల కేటగిరీలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన ఈ ఫ్రీస్టయిల్‌ రెజ్లర్‌ సస్పెన్షన్‌ వేటుతో విశ్వ క్రీడలకు దూరమయ్యాడు.

మరిన్ని వార్తలు