అంతా ధోని వల్లే..: ఆర్సీబీ బౌలర్‌

15 Oct, 2020 16:29 IST|Sakshi

దుబాయ్‌: ఐపీఎల్‌ సీజన్‌లో అత్యుత్తమ ఎకానమీతో నమోదు చేస్తూ ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌. తానొక ఆఫ్‌స్పిన్నర్‌ననే బెరుకు కానీ, బ్యాట్స్‌మెన్‌ విరుచుకుపడతారన్న భయం కానీ భారీగా పరుగులు ఇస్తాననే ఆందోళన కానీ సుందర్‌ కు లేవు. అతనికి ఉన్నదల్లా తనపై తనకు నమ్మకమే. ఇప‍్పటివరకూ ఐదు వికెట్లను మాత్రమే సుందర్‌ సాధించినా, పరుగుల ఇవ్వడంలో అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ ఎకానమీ పరంగా టాప్‌ లేపుతున్నాడు. అతని ఎకానమీనే ఆర్సీబీకి కొన్ని అద్భుతమైన విజయాలను సాధించి పెట్టిందనేది అందరికీ తెలిసిన సత్యం. ఈ సీజన్‌లో అత్యుత్తమ ఎకానమీ జాబితాలో సుందర్‌ రెండో స్థానంలో ఉన్నాడు.  ఇప్పటివరకూ 4.90 ఎకానమీ నమోదు చేశాడు సుందర్‌. అంటే ఓవర్‌కు ఐదు పరుగులు కంటే తక్కువ ఇస్తూ శభాష్‌ అనిపిస్తున్నాడు. ఐపీఎల్‌-2020లో సుందర్‌ ఇప్పటివరకూ 22 ఓవర్లు వేసి 108 పరుగులు మాత్రమే ఇచ్చాడు. (ఐపీఎల్‌ చరిత్రలోనే ‘ఫాస్టెస్ట్‌’ రికార్డు)

ఇదిలా ఉంచితే, తన బౌలింగ్‌లో రాటుదేలడానికి టీమిండియా మాజీ కెప్టెన్‌, సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనినే కారణమంటున్నాడు సుందర్‌. ‘గతంలో రైజింగ్‌ పుణెకు ధోని నాయకత్వంలోనే ఆడాను. అప్పుడు నేను క్రికెటర్‌గా పరిపక్వత సాధించడానికి ధోని చేసిన సాయం మరువలేనిది. పుణెకు ఆడిన సమయంలోనే నేను బాగామెరుగయ్యా. అందుకు కారణం ధోనినే. ఒక బౌలర్‌గా ఎదిగింది ధోని నాయకత్వంలోనే. ఈ స్థాయిలో ఉండటానికి ధోనినే ప్రధాన కారణం’ అని సుందర్‌ తెలిపాడు. కింగ్స్‌ పంజాబ్‌తో గురువారం మ్యాచ్‌ జరుగనున్న తరుణంలో సుందర్‌ మాట్లాడాడు. ఇక బ్యాట్స్‌మన్‌ను ఎలా బోల్తా కొట్టిస్తున్నారు అనే విషయంపై కూడా సుందర్‌ పెదవి విప్పాడు. ‘ మనం బంతిని కొద్ది ఆలస్యంగా చేతి నుంచి రిలీజ్‌ చేయడమే ప్రధానమైనది. అక్కడ బ్యాట్స్‌మన్‌ ఫుట్‌వర్క్‌ను ఫాలో అయితే బంతిని వేయడం ఈజీగా ఉంటుంది. బ్యాట్స్‌మన్‌ ఏమీ చేయబోతున్నాడు అనేది మనం బంతిని ఆలస్యంగా విడుదల చేయడంపైనే ఉంటుంది. బంతిని వీలైనంత ఆలస్యంగా విడుదల చేయడం గురించి నాకు అవగాహన ఉంది. అదే నా టెక్నిక్‌’ అని సుందర్‌ పేర్కొన్నాడు. (ధోని కెప్టెన్సీ మ్యాజిక్‌)

Poll
Loading...
మరిన్ని వార్తలు