'కోహ్లి, డివిలియర్స్‌ ఫేవరెట్‌ కాదు'

18 Sep, 2020 12:51 IST|Sakshi

దుబాయ్‌ : భారత మాజీ ఆటగాడు.. లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌  గురువారం చెన్నై సూపర్‌ కింగ్స్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన చేసిన సంగతి తెలిసిందే. ఈ ఐపీఎల్‌లో చెన్నై టైటిల్‌ గెలవడం కష్టమే అన్న గవాస్కర్‌ ధోనికి మాత్రం లాభదాయకంగా మారనుందంటూ పేర్కొన్నాడు. తాజాగా సునీల్‌ గవాస్కర్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై స్పందించాడు. (చదవండి : ఈసారి చెన్నై టైటిల్‌ గెలవడం కష్టమే..)

'పేపర్‌పై బలంగా కనిపించే ఆర్‌సీబీ జట్టు ఇంతవరకు ఐపీఎల్‌ టైటిల్‌ గెలవకపోవడం ఒక మిస్టరీగా మారింది. మేటి ఆటగాళ్లైన విరాట్‌ కోహ్లి, డివిలియర్స్‌ లాంటి వారు ఉన్నా ఆ జట్టు కీలకదశలో ఒత్తిడికి లోనయ్యేది. ఒకవేళ వీరిద్దరు విఫలమైతే.. ఇక ఆర్‌సీబీ జట్టులో మిగతా ఆటగాళ్లు ఆడలేరన్నంతగా ముందుగానే చేతులెత్తేస్తుంది. ఈసారి టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న ఆర్‌సీబీకి కొత్త కోచ్‌ తన సలహాలతో జట్టు తలరాత మారుస్తాడేమో చూడాలి. అంటే పేర్కొన్నాడు.

దీంతో పాటు ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఆర్‌సీబీ జట్టు తరపున మ్యాచ్‌ విన్నర్‌ ఎవరనేది గవాస్కర్‌ పేర్కొన్నాడు. 'ఈ ఐపీఎల్‌లో కోహ్లి, డివిలియర్స్‌లే ఫేవరెట్ అని అంతా భావిస్తున్నారు.  నిజానికి ఈసారి లెగ్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ మ్యాచ్‌ విన్నర్‌ కానున్నాడు. యూఏఈ పిచ్‌లు స్లోగా ఉండడంతో స్పిన్‌ బౌలర్లు కీలకంగా మారనున్నారు. అందుకే చహల్‌ మ్యాచ్‌ విన్నర్‌ కానున్నాడు. ' అంటూ తెలిపాడు. (చదవండి : ఖాళీ మైదానాలతో తీవ్రత తగ్గదు!) 

గత 12 సీజన్లుగా పేపర్‌పై బలంగా కనిపించే ఆర్‌సీబీ జట్టు ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో మాత్రం తడబడుతూనే ఉంది. విరాట్‌ కోహ్లి.. ఏబీ డివిలియర్స్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్లు  ఉన్నా ఆ జట్టు తలరాత మాత్రం మారడం లేదు. ఈసారి వేలంలో బిగ్‌ హిట్టర్‌ ఆరోన్‌ ఫించ్‌, ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌లను దక్కించుకొని మరింత బలంగా తయారైంది. ఈసారి మాత్రం టైటిల్‌ను ఎలాగైనా దక్కించుకోవాలనే కసితో బరిలోకి దిగుతున్న ఆర్‌సీబీ ఏం చేస్తుందో చూడాలి. కాగా ఆర్‌సీబీ జట్టు సెప్టెంబర్‌ 21న తమ మొదటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు