Sanju Samson: దేవుడిచ్చిన టాలెంట్‌ను అనవసరంగా వేస్ట్‌ చేస్తున్నాడు

22 Sep, 2021 17:28 IST|Sakshi
Courtesy: IPL Twitter

శాంసన్‌ అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే దేవుడిచ్చి మంచి టాలెంట్‌ను వేస్ట్‌ చేసినట్టే

Sunil Gavaskar Suggestion To Sanju Samson.. రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌పై టీమిండియా మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దేవుడిచ్చిన గొప్ప టాలెంట్‌ను సంజూ వేస్ట్‌ చేసుకుంటున్నాడని.. షాట్‌ సెలక్షన్‌ తప్పుగా ఉందని అభిప్రాయపడ్డాడు. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ అనంతరం సునీల్‌ గావస్కర్‌ స్టార్‌స్పోర్ట్స్‌ ఇంటర్య్వూలో మాట్లాడాడు.

చదవండి: T. Natarajan SRH: పాపం నటరాజన్‌కే ఎందుకిలా ?


''సంజూ షాట్‌ సెలక్షన్‌ సరిగా లేదు. క్రీజులోకి వచ్చిన వెంటనే బిగ్‌ షాట్స్‌ ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. జట్టు ఓపెనర్‌గా వస్తే రిస్కీ షాట్స్‌ ఆడినా ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఆరంభంలో ఎంత వేగంగా ఆడితే జట్టుకు అంత స్కోరు వస్తుంది. ఇక శాంసన్‌ సంగతికి వస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌ సహా ఐపీఎల్‌లో ఎక్కువసార్లు వన్‌డౌన్‌ లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. బ్యాట్స్‌మన్‌ ఎంత మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ ఆరంభంలోనే దూకుడుగా ఆడాలంటే కుదరదు. నాలుగు ఐదు బంతుల పాటు కాస్త నిధానంగా ఆడితే ఆ తర్వాత భారీ షాట్లకు ఆస్కారం ఉంటుంది. ఇది శాంసన్‌ అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే దేవుడిచ్చి మంచి టాలెంట్‌ను వేస్ట్‌ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇప్పటికైనా షాట్‌ ఎంపికలో కచ్చితత్వం పాటిస్తే జాతీయ జట్టులో చోటు స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది.'' అని చెప్పుకొచ్చాడు. 

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. మంగళవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాజస్తాన్‌ రాయల్స్‌ 2 పరుగులతో తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్‌ కార్తిక్‌ త్యాగి ఆఖరి ఓవర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన రెండు వికెట్లు తీశాడు.  తద్వారా ఐపీఎల్‌-2021 రెండో అంచెలో రాజస్తాన్‌ రాయల్స్‌ తొలి గెలుపు నమోదు చేసింది. ఈ విజయంతో రాజస్తాన్‌ 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. 4 ఓటములతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. కాగా రాజస్తాన్‌ తన తర్వాతి మ్యాచ్‌ను సెప్టెంబర్‌ 25న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.

చదవండి: Sanju Samson: గెలుపుతో జోరు మీదున్న రాజస్తాన్‌కు ఎదురుదెబ్బ!

మరిన్ని వార్తలు