ఆత్మీయతను పంచడం అభినందనీయం: గవాస్కర్‌

26 Sep, 2022 08:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అవస్థలు, నొప్పులు లేకుండా ఏ జీవితం ముగియదు. అలాంటి సందర్భంలో మేమున్నామని ఆత్మీయతను పంచడం ఉన్నతమైన సేవలని భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ అన్నారు. నగరంలోని స్పర్శ్‌ హాస్పీస్‌ పాలియాటివ్‌ కేర్‌ సెంటర్‌ను సునీల్‌ గవాస్కర్‌ ఆదివారం సందర్శించి అక్కడి పేషెంట్లతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవిత చరమాంకంలో ఎదురయ్యే అవస్థలను తగ్గించడానికి అందించే ఉపశమన సేవలు అరుదని, నగరం వేదికగా రోటరీ క్లబ్‌ ఆఫ్‌ బంజారాహిల్స్‌ ఆధ్వర్యంలో ఉచితంగా అందింస్తున్న ఈ సేవలు అభినందనీయమన్నారు. చిన్నతనంలో తను కూడా డాక్టర్‌ కావాలనే బలమైన కోరిక ఉండేదని, తన కుటుంబ సభ్యుల్లో ఉన్న డాక్టర్ల వలన వైద్య రంగంలోని ఔన్నత్యాన్ని తెలుసుకున్నానని పేర్కొన్నారు.  కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ సభ్యులు, స్పర్శ్‌ హాస్పీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: (Ind Vs Aus 3rd T20- Uppal: హైదరాబాద్‌ బిర్యానీకి రోహిత్‌ ఫిదా) 

మరిన్ని వార్తలు