నరైన్‌ సూపర్‌ బౌలింగ్‌.. అయ్యర్‌కు బొమ్మ కనపడింది

28 Sep, 2021 17:09 IST|Sakshi
Courtesy: IPL Twitter

Sunil Narine Super Bowling.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తడబడుతుంది. 16 ఓవర్ల ఆట ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ఇక విషయంలోకి వెళితే.. 24 పరుగులు చేసిన ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్‌ అయ్యర్‌ తొలి బంతి నుంచే ఇబ్బంది పడ్డాడు.  ఇన్నింగ్స్‌ 7వ ఓవర్‌ సునీల్‌ నరైన్‌ వేశాడు. ఓవర్‌ రెండో బంతిని ఆఫ్‌స్టంఫ్‌ అవతల వేయడంతో అయ్యర్‌ బంతిని వదిలేశాడు. అయితే అనూహ్యంగా టర్న్‌ అయిన బంతి ఆప్‌స్టంప్‌ వికెట్‌ను ఎగురగొట్టింది. దీంతో బిత్తరపోయిన అయ్యర్‌ కాసేపు అలాగే నిల్చుండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

చదవండి: Ishan Kishan: కోహ్లి పట్టుకోగానే దుఃఖం ఆపుకోలేకపోయాడు..  అందుకేనా!

వార్నర్‌ స్థానంలో వచ్చాడు.. డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు

మరిన్ని వార్తలు