కోవిడ్‌పై పోరు: సన్‌రైజర్స్‌ భారీ విరాళం

10 May, 2021 13:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహమ్మారి కోవిడ్‌-19పై భారత్‌ పోరులో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ విరాళం ప్రకటించింది. తన వంతు సాయంగా రూ. 30 కోట్లను కోవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌కు అందజేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ప్రకటన విడుదల చేసింది. ‘‘కరోనా సెకండ్‌వేవ్‌ కారణంగా ప్రభావితమైన బాధితులకు అండగా ఉండేందుకు సన్‌ టీవీ నెట్‌వర్క్‌ రూ. 30 కోట్లను విరాళంగా ఇస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడతున్న వివిధ కార్యక్రమాలకు ఈ నిధులను ఉపయోగించనున్నాం. ఆక్సీజన్‌ సిలిండర్లు, మెడిసిన్‌ సరఫరా నిమిత్తం ఎన్జీఓలతో భాగస్వామ్యమై ముందుకు సాగుతాం. అంతేకాదు మీడియా ద్వారా కరోనా వ్యాప్తి అడ్డుకట్టకై తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం’’ అని పేర్కొంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు