'ఫ్యామిలీ మ్యాన్‌-3'కి ప్రిపేర్‌ అవుతున్నావా బ్రో..

10 Jun, 2021 16:07 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ ఆటగాడు సురేశ్‌ రైనా.. తన ఐపీఎల్‌ సహచరుడు, సీఎస్‌కే బౌలర్‌ దీపక్‌ చాహర్‌పై ఫన్నీ కామెంట్స్‌ చేశాడు. చాహర్‌.. తాజాగా తన న్యూలుక్‌కి సంబంధించిన ఫోటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా, రైనా స్పందించాడు. ఈ ఫోటోలో చాహర్‌.. ప్రముఖ వెబ్‌ సిరీస్‌ ఫ్యామిలీ మ్యాన్‌-2లో టెర్రరిస్ట్‌ క్యారెక్టర్‌ను పోలి ఉన్నాడని, ఫ్యామిలీ మ్యాన్ పార్ట్ 3 ఆన్‌ ద వే అంటూ కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం రైనా చేసిన ఈ కామెంట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. మరోవైపు చాహర్‌ అభిమానులు కూడా తమదైన శైలిలో స్పందించారు.

ఫ్యామిలీ మ్యాన్‌-2లో లీడ్‌ రోల్‌ శ్రీకాంత్.. ఫ్యామిలీ అడ్వైజర్‌ను కలిసే సీన్ చాహర్‌కు సరిపోతుందంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే చాహర్‌.. గజినీలో ఆమీర్‌ ఖాన్‌ను పోలి ఉన్నాడంటున్నారు. ఇదిలా ఉంటే, దేశంలో ప్రస్తుతం 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ మేనియా నడుస్తోంది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌.. విమర్శకుల ప్రశంసల్ని సైతం అందుకుంటుంది. ఫ్యామిలీ మ్యాన్‌-2లో టాలీవుడ్ హీరోయిన్ సమంతా కీలక పాత్ర పోషించింది. నెగటీవ్ రోల్ అయినప్పటికీ.. రాజీ పాత్రలో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సెకండ్ సీజన్‌ను తమిళులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

తమను కించపరిచే సీన్లున్నాయని, అందకే ఈ సినిమాను నిషేధించాలని వారు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, ఈ వెబ్‌ సిరీస్‌ను తెలుగు వారు, చిత్తూరు జిల్లాకు చెందిన రాజ్ అండ్ డీకే(రాజ్ నిడిమోరి, దాసరి కృష్ణ) డైరెక్ట్ చేశారు. ఇదిలా ఉంటే, కరోనా వైరస్ నేపథ్యంలో ఫ్యామిలీ మ్యాన్‌ మూడో పార్ట్ కూడా రానుందని తెలుస్తోంది. ఇక ఐపీఎల్ 2021 సీజన్ అర్థంతరంగా వాయిదా పడటంతో సురేశ్ రైనా, దీపక్ చాహర్ ఇంటికే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో చాహర్‌కు చోటు దక్కలేదు. అయితే జూలైలో శ్రీలంకలో పర్యటించనున్న భారత బి జట్టులో అతనికి చోటు దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. 
చదవండి: విశ్వనాథన్‌ ఆనంద్‌తో తలపడనున్న ఆమీర్ ఖాన్‌.. ఎందుకో తెలుసా?
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు