Suresh Raina: సురేష్‌ రైనాకు అరుదైన గౌరవం..!

5 Aug, 2022 17:42 IST|Sakshi

Suresh Raina Doctorate: టీమిండియా మాజీ ఆటగాడు సురేష్‌ రైనాకు అరుదైన గౌరవం దక్కింది. చెన్నైలోని ప్రముఖ వేల్స్‌ యూనివర్శిటీ రైనాను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా రైనా అభిమానులతో పంచుకున్నాడు. "ప్రతిష్టాత్మక వేల్స్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఈ గౌరవాన్ని పొందినందుకు సంతోషంగా ఉంది. నాపై చూపించిన ప్రేమకు, అభిమానానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు.

చెన్నై నాకు సొం‍త ఇల్లు వంటింది. ఇది ఇప్పటికీ నాకు చాలా ప్రత్యేకమైనదిగా ఉండిపోతుంది" అని రైనా ట్విటర్‌లో పేర్కొన్నాడు. కాగా 2018లో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్న తర్వాత రైనా ఐపీఎల్‌లో మాత్రం కొనసాగాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు  ప్రాతినిధ్యం వహించిన రైనా  ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు.

కాగా ఐపీఎల్‌-2022కు ముందు  రైనాను చెన్నై సూపర్‌ కింగ్స్‌ అనూహ్యంగా రీటైన్‌ చేసుకోలేదు. దీంతో అతడు వేలంలో పాల్గొన్నాడు. అయితే  మిస్టర్‌ ఐపీఎల్‌గా పేరొందిన రైనాను ఐపీఎల్‌-2022 వేలంలో ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయకపోవడం అందరనీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక వేలంలో అమ్ముడుపోని రైనా ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా సరికొత్త అవతరామెత్తాడు. ఇక భారత తరపున 18 టెస్టులు, 226 వన్డేలు,78 టీ20లు ఆడిన రైనా.. వరుసగా 768, 5615, 1605 పరుగులు సాధించాడు.


చదవండి: KL Rahul: వాళ్లు ఉన్నారుగా! మనకి కేఎల్‌ రాహుల్‌ అవసరమా?! అనిపించేలా..

మరిన్ని వార్తలు