Suresh Raina: సురేశ్‌ రైనా తిరిగి వస్తున్నాడు..

10 Sep, 2022 18:48 IST|Sakshi

మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా.. పరిచయం అక్కర్లేని పేరు. ధోని హయాంలో టీమిండియాలో రైనా ఒక వెలుగు వెలిగాడు. కొన్నాళ్ల పాటు తనదైన ఆటతో ప్రత్యేక ముద్ర వేసిన రైనా.. ధోని రిటైర్‌మెంట్‌ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రోజునే(ఆగస్టు 15, 2020).. రైనా కూడా వీడ్కోలు పలకడం విశేషం. ధోనితో ప్రత్యేక అనుబంధం ఉన్న రైనా ఇటీవలే(సెప్టెంబర్‌ 6న) అన్ని రకాల ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. 

అయితే రైనా మళ్లీ తిరిగి వస్తున్నాడు. రోడ్‌ సేఫ్టీ లీగ్‌ వరల్డ్‌ సిరీస్‌లో ఆడేందుకు రైనా సచిన్‌ టెండూల్కర్‌ నేతృత్వంలోని ఇండియా లెజెండ్స్‌ జట్టుతో జాయిన్‌ అయ్యాడు. శనివారం(సెప్టెంబర్‌ 10న) కాన్పూర్‌ వేదికగా ఇండియా లెజెండ్స్‌, సౌతాఫ్రికా లెజెండ్స్‌ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు రైనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోనూ షేర్‌ చేశాడు. ఆ వీడియోలో రైనా తన జెర్సీ నెంబర్‌ అయిన '48' ధరించి నడుచుకుంటూ వెళ్తుంటాడు.

''రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌కు అంతా సిద్ధం.. టీమిండియా లెజెండ్స్‌ తరపున ఆడేందుకు తిరిగి వస్తున్నా'' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. రైనా పెట్టిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగానే.. విండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా ఫన్నీగా స్పందించాడు. ''వస్తే వస్తున్నావు కానీ మమ్మల్ని మాత్రం ఈజీగా తీసుకో ప్లీజ్‌'' అంటూ లాఫింగ్‌ ఎమోజీతో క్యాప్షన్‌ జత చేశాడు.

A post shared by Suresh Raina (@sureshraina3)

చదవండి: Road Safety World Series 2022: ఇండియా లెజెండ్స్‌తో సౌతాఫ్రికా దిగ్గజాల 'ఢీ'

మరిన్ని వార్తలు