IND Vs PAK T20 WC 2022: 'పాక్‌తో గెలిస్తే చాలు ప్రపంచకప్‌ మనదే'.. రైనా జోస్యం

18 Oct, 2022 11:40 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన టీమిండియా, పాకిస్తాన్‌ మ్యాచ్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ ఆదివారం జరగనున్న మ్యాచ్‌కు ప్రేక్షకులు పోటెత్తనున్నారు. లైవ్‌లో చూడలేని వాళ్లు టీవీలో వీక్షించనున్నారు. మొత్తానికి ఆరోజు టీఆర్పీ రేటింగ్‌లు బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా మాటలు తూటాలు పేల్చుకుంటున్నారు. ఇక టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా టీమిండియా,పాకిస్తాన్‌ మ్యాచ్‌పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

''పాకిస్తాన్‌తో జరిగే ఓపెనింగ్ మ్యాచ్‌లో గెలిస్తే చాలు ఆ విజయోత్సాహంతో టీమిండియా వరల్డ్ కప్ గెలిచేస్తుంది. ఇప్పుడు టీమిండియా బాగానే ఆడుతోంది. బుమ్రా లేకపోయినా షమీ అతని ప్లేస్‌ని రిప్లేస్‌ చేశాడు.ఈ సిరీస్‌లో మహ్మద్ షమీ, టీమిండియాకి ఎక్స్‌-ఫ్యాక్టర్ అవుతాడని అనిపిస్తోంది. అంతేకాకుండా అర్ష్‌దీప్ సింగ్, సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. విరాట్ కోహ్లీ కూడా మంచి టచ్‌లో కనబడుతున్నాడు. ఏ టోర్నీ అయినా మొదటి మ్యాచ్‌లో గెలవడం చాలా ముఖ్యం. తొలి మ్యాచ్‌ ప్రభావం తర్వాతి మ్యాచ్‌ల్లో కచ్చితంగా ఉంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేశాను.

పాక్‌పై విజయం సాధిస్తే టీమ్‌లో ఎనలేని ఉత్సాహం వస్తుంది. మిగిలిన జట్లను మట్టి కరిపించి టైటిల్‌ గెలవాడినిక ఇదొక్కటి చాలు. ఈసారి టీమిండియా వరల్డ్ కప్‌ గెలవాలని కోరుకుంటున్నా. బుమ్రా, రవీంద్ర జడేజా స్థానాలను భర్తీ చేయడం కష్టం. ఈసారి మహ్మద్ షమీ కీలకం కానున్నాడు. అతని అనుభవం టీమిండియాకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న వారిలో అతనే బెస్ట్ ఆప్షన్. 2007 టీ20 వరల్డ్ కప్‌లో గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ ఎలా ఆడారో అందరికీ తెలుసు. 2011 వన్డే వరల్డ్ కప్‌లోనూ వీళ్లే కీలకంగా మారారు. అలా చూసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రిషబ్ పంత్ టీమిండియాకి కీలక ఆటగాడయ్యే అవకాశం ఉంది'' అంటూ పేర్కొన్నాడు.

చదవండి: టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆ రెండు జట్ల మధ్యే : సునీల్ గవాస్కర్

Poll
Loading...
మరిన్ని వార్తలు