మేమంతా ఏడ్చేశాం: సూర్యకుమార్‌

27 Feb, 2021 15:54 IST|Sakshi

ముంబై: ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌కు ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్ ఎంపికైన సంగతి తెలిసిందే. అప్పటినుంచి టీమిండియాకు ఎప్పుడు ప్రాతినిధ్యం వహించాలా అని ఎదురుచూస్తున్నాడు.  కోహ్లి సారధ్యంలో ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు ఇప్పటికే తెలిపాడు.తాజాగా సూర్య.. తాను టీమిండియాకు ఎంపికైన రోజు గురించి మాట్లాడుతూ.. ఆరోజు జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.

' టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించే సమయంలో నేను రూమ్‌లోనే ఉన్నా. మూవీ చూద్దామని టీవీ ఆన్‌ చేసి కూర్చున్న కాసేపటికే నా మొబైల్‌కు ఒక నోటిఫికేషన్‌ వచ్చింది. ఓపెన్‌ చేసి చూడగానే టీ20 సిరీస్‌ జట్టులో చోటు సంపాదించినట్లుగా మెసేజ్‌ వచ్చింది. టీమిండియా ప్రాబబుల్స్‌లో నా పేరు చూసుకొని ఏడ్చేచా. ఆ తర్వాత నా ఫ్యామిలీకి వీడియో కాల్‌ చేసి భారత జట్టుకు ఎంపికైన విషయాన్ని పంచుకున్నా. అంతే.. ఆ వార్త వినగానే నా పేరెంట్స్‌, భార్య, చెల్లి అందరూ సంతోషంతో ఏడ్చేచారు. వారిని చూసి నేను కాస్త ఎమోషనల్‌కు గురయ్యా. జాతీయ జట్టుకు ఎంపికవ్వాలనే వారి కల నేటితో తీరిపోయింది. ఎన్నో ఏళ్లుగా నా కుటుంబం నాకు అండగా నిలుస్తూ వచ్చింది. అందుకే వారు అంత ఎమోషన్‌ల్‌ అయ్యారు' అని చెప్పుకొచ్చాడు.

గతేడాది ముంబై ఇండియన్స్‌ తరపున 16 మ్యాచ్‌లాడిన సూర్యకుమార్‌ 145 స్ట్రైక్‌రేట్‌తో 480 పరుగులు సాధించాడు. కాగా సూర్య కుమార్‌తో పాటు ఇషాన్‌ కిషన్‌, రాహుల్‌ తెవాటియా కూడా జట్టులో చోటు సంపాదించిన సంగతి తెలిసిందే. భారత్‌, ఇంగ్లండ్‌ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌ మార్చి 12 నుంచి ప్రారంభం కానున్నాయి. కాగా ఐదు మ్యాచ్‌లు అహ్మాదాబాద్‌ వేదికగానే జరగనున్నాయి.
చదవండి: ఇన్నాళ్ల నిరీక్షణ ముగిసింది.. కంగ్రాట్స్‌ సూర్య 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు