-

Suryakumar Yadav: దుమ్ములేపిన సూర్య.. అదే జరిగితే మలన్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు

1 Feb, 2023 15:55 IST|Sakshi
సూర్యకుమార్‌ యాదవ్‌

ICC Men's T20I Batting Rankings- Suryakumar Yadav: పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ హవా కొనసాగుతోంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న మిస్టర్‌ 360.. ఇంగ్లండ్‌ బ్యాటర్‌ డేవిడ్‌ మలన్‌ అరుదైన రికార్డుపై కన్నేశాడు. కాగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌తో సూర్య బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

రాంచీ మ్యాచ్‌తో..
ఈ క్రమంలో రాంచిలో జరిగిన తొలి మ్యాచ్‌లో 34 బంతుల్లో 47 పరుగులు చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌.. 910 రేటింగ్‌ పాయింట్లు సాధించి సత్తా చాటాడు. అయితే, రెండో టీ20లో 31 బంతుల్లో 26 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో రెండు పాయింట్లు కోల్పోయి 908 రేటింగ్‌ పాయింట్ల వద్ద నిలిచిపోయాడు.

మలన్‌ ఆల్‌టైం రికార్డు
అయితే, అహ్మదాబాద్‌లో ఆఖరిదైన మూడో టీ20లో ఈ ముంబైకర్‌ బ్యాట్‌ ఝులిపిస్తే గనుక కెరీర్‌ బెస్ట్‌ రేటింగ్‌ అందుకునే అవకాశం ఉంది. కాగా 2020లో ఇంగ్లండ్‌ బ్యాటర్‌ డేవిడ్‌ మలన్‌ 915 పాయింట్లతో టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. పాయింట్ల రికార్డు విషయంలో సూర్య ప్రస్తుతం మలన్‌ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. 

ఇక టీ20 ఫార్మాట్‌లో దుమ్మురేపుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌.. ఐసీసీ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే టీమిండియాతో సిరీస్‌లో సత్తా చాటిన కివీస్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌.. ఎనిమిది స్థానాలు ఎగబాకి 19వ ర్యాంకుకు చేరుకున్నాడు. అదే విధంగా డారిల్‌ మిచెల్‌ తొమ్మిది స్థానాలు మెరుగుపరచుకుని 29వ స్థానంలో నిలిచాడు.

ఐసీసీ టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌- టాప్‌-5లో ఉన్నది వీళ్లే
1.సూర్యకుమార్‌ యాదవ్‌(908 పాయింట్లు)- ఇండియా
2. మహ్మద్‌ రిజ్వాన్‌ (836)- పాకిస్తాన్‌
3. డెవాన్‌ కాన్వే(788)- న్యూజిలాండ్‌
4. బాబర్‌ ఆజం(778)- పాకిస్తాన్‌
5. ఎయిడెన్‌ మార్కరమ్‌(748)- సౌతాఫ్రికా

చదవండి: Hanuma Vihari: శభాష్‌ విహారి.. నీ పోరాటానికి సలాం, మణికట్టు గాయమైనా ఒంటి చేత్తో వీరోచిత పోరాటం
Prithvi Shaw: పృథ్వీ షాకు నో ఛాన్స్‌! ఓపెనర్లుగా గిల్‌- ఇషాన్‌ జోడీనే.. ఎందుకంటే..
Ind Vs NZ: ఏదైతేనేం.. హార్దిక్‌ అలా! సూర్య ఇలా!... ఎన్నో మార్పులు.. భావోద్వేగానికి లోనైన ‘స్కై’

మరిన్ని వార్తలు