IND vs AUS: గోల్డన్‌ డక్‌లు.. సూర్యను పక్కన పెట్టండి!అతడిని జట్టులోకి తీసుకురండి

19 Mar, 2023 16:48 IST|Sakshi

టీ20ల్లో దుమ్మురేపుతున్న టీమిండియా స్టార్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌.. వన్డేల్లో మాత్రం తనదైన మార్క్‌ చూపించడంలో విఫలమవుతున్నాడు. వాఖండే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగిన సూర్య.. ఇప్పుడు రెండో వన్డేలోనూ తొలి బంతికే పెవిలియన్‌ చేరాడు. ఈ మ్యాచ్‌లో కూడా మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లోనే సూర్య తన వికెట్‌ కోల్పోయాడు.

రెండు సార్లు కూడా సూర్య.. ఎల్బీ రూపంలోనే వెనుదిరిగాడు. కాగా ఈ ఒక్క సిరీస్‌ మాత్రమే కాకుండా.. గత సిరీస్‌లలో కూడా సూర్య దారుణంగా విఫలమయ్యాడు. గత పది వన్డే మ్యాచ్‌ల్లో వరుసగా 13, 9,8, 4, 34, 6, 4, 31, 14 , 0 పరుగులు చేశాడు. గత పది ఇన్నింగ్స్‌లలో ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా అతడు సాధించకపోవడం గమానార్హం.

ఇప్పటివరకు 21 వన్డే మ్యాచ్‌ల్లో 19 ఇన్నింగ్స్‌లు ఆడి  27.06 సగటుతో 433 పరుగులు మాత్రమే సూర్య చేశాడు. వన్డేల్లో అతడి ఖాతాలో ఇప్పటివరకు కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి.

సంజూ శాంసన్‌ రావాలి..
ఇక వరుసగా విఫలమవుతున్న సూర్య స్థానంలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ను ఎంపిక చేయాలి ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు.  #సంజూ శాంసన్‌ అనే ట్యాగ్‌ను సోషల్‌ మీడియాలో నెటిజన్లు ట్రెండ్‌ చేస్తున్నారు. కాగా మోకాలి గాయం నుంచి కోలుకున్న శాంసన్‌ ప్రస్తుతం బెంగళూరులోని నెషనల్‌ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.

ఇక​ శాంసన్‌కు అంతర్జాతీయ టీ20ల్లో మంచి ట్రాక్‌ రికార్డు లేనప్పటికీ.. వన్డేల్లో మాత్రం గణనీయమైన రికార్డు ఉంది. అతడి గత 8 ఇన్నింగ్స్‌లలో 272 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 86(నాటౌట్‌) టాప్‌ స్కోర్‌గా ఉంది.

>
మరిన్ని వార్తలు