ICC T20I Rankings: రాకెట్ వేగంతో దూసుకొచ్చిన సూర్య‌కుమార్‌, వెంక‌టేశ్ అయ్య‌ర్‌

23 Feb, 2022 17:45 IST|Sakshi

ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా విధ్వంస‌క‌ర బ్యాట‌ర్లు సూర్యకుమార్ యాద‌వ్‌, వెంకటేష్ అయ్యర్‌లు రాకెట్ వేగంతో దూసుకొచ్చారు. వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శనలకు గాను ఈ ఇద్దరు ర్యాంకింగ్స్‌లో ఒక్క‌సారిగా పైకి ఎగ‌బాకారు. ఈ సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన సూర్యకుమార్ 35 స్థానాలు ఎగబాకి 21వ స్థానానికి చేరుకోగా, వెంకటేష్ అయ్యర్ ఏకంగా 203 స్థానాలు మెరుగుప‌ర్చుకుని 115వ స్థానానికి చేరుకున్నాడు.

ఈ జాబితాలో టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ రెండు స్థానాలు దిగజారి ఆరో స్థానానికి ప‌డిపోగా, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి 10వ స్థానాన్ని నిల‌బెట్టుకున్నాడు. పాక్ ఆట‌గాళ్లు బాబ‌ర్ ఆజ‌మ్‌, మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌లు తొలి రెండు స్థానాల‌ను కాపాడుకున్నారు. ఇక బౌలర్లు, ఆల్ రౌండర్ల విష‌యానికొస్తే.. ఈ విభాగ‌పు టాప్-10 జాబితాల్లో ఏ ఒక్క టీమిండియా క్రికెట‌ర్‌కు కూడా చోటు దక్కలేదు. బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 20వ ర్యాంక్‌కే అత్యుత్తమం. 
చ‌ద‌వండి: ఐపీఎల్‌లో అన్‌సోల్డ్‌.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం.. ఆ వెనుకే 7.75 కోట్ల ఆటగాడు!

మరిన్ని వార్తలు